క్రైమ్/లీగల్

దోషి పిటిషన్‌ను కొట్టేసిన కోర్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 19: నిర్భయ గ్యాంగ్ రేప్, హత్య కేసులో మరణశిక్ష పడిన నలుగురు దోషుల్లో పవన్ కుమార్ గుప్తా అనే ఒకతను తాను నేరం జరిగిన సమయంలో బాలుడినని పెట్టుకున్న పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు గురువారం కొట్టివేసింది. 2012 డిసెంబర్‌లో నేరం జరిగిన సమయంలో తాను బాల్యదశలో ఉన్నానని దోషి పవన్ కుమార్ గుప్తా తన పిటిషన్‌లో చేసిన వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. దోషి పవన్ తరపున పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాది ఏపీ సింగ్ ప్రవర్తనను హైకోర్టు తప్పుబట్టింది. సింగ్ నకిలీ పత్రాలు సమర్పించాడని, కోర్టులో విచారణకు హాజరు కాలేదని నిందించింది. పవన్ కుమార్ తనకు పడిన మరణశిక్షపై ఇదివరకే సుప్రీంకోర్టులో దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌లో నేరం జరిగిన సమయంలో తాను బాల్యంలో ఉన్నానని వాదించాడని, ఆ వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చిందని, అతని పిటిషన్‌ను గత సంవత్సరం జూలై తొమ్మిదో తేదీన అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసిందని ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి సురేశ్ కుమార్ కైట్ పేర్కొన్నారు. ఈ విషయాన్ని దాచిపెట్టి, మళ్లీ అదే అంశంపై పిటిషన్ దాఖలు చేసిన దోషి తరపు న్యాయవాది సింగ్ ప్రవర్తనతో ఆయన చికాకు పడ్డారు. ఇందుకు గాను హైకోర్టు.. న్యాయవాది సింగ్‌కు రూ. 25వేలు మూల్యంగా చెల్లించాలని ఆదేశించింది. అనాథ మహిళలు, పిల్లల సంక్షేమం కోసం ‘నిర్మల్ ఛాయ’ పేరిట వారం రోజులలోగా ఈ డబ్బును డిపాజిట్ చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు.