క్రైమ్/లీగల్

చంచల్‌గూడ జైలుకు డీసీపీ నర్సింహా రెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో సిద్దిపేట డీసీపీ గోవింద్ నర్సింహారెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. గురువారం నర్సింహారెడ్డిని అరెస్టు చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు. మహబూబ్‌నగర్, జహీరాబాద్, హైదరాబాద్, అయ్యవారిపల్లి, సిద్దిపేటల్లో ఆయన బంధువుల్లో సైతం ఏసీబీ అధికారులు దాడులు చేశారు. దాదాపు 10 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు అంచనా. ఆయన నివాసాల్లో కిలోన్నర్ర బంగారం, వివిధ బ్యాంక్‌ల్లో రూ. 12 లక్షలు నగదును స్వాధీనం చేసుకున్నారు. గోల్కొండ ఏరియాలో విలువైన విల్లాలతో పాటు మరో 14 ఇళ్లకు సంబంధించిన డాక్యుమెంట్ల దొరికాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో 20 ఎకరాల భూములు ఉన్నట్లు తెలింది. ఏసీబీ అధికారులు అరెస్టు చేసి
అనిశా ప్రత్యేక కోర్టులో హాజరు పర్చగా కోర్టు 14 రోజుల రిమాండ్ పంపింది. గురువారం రాత్రి పొద్దుపోయాక కూడా ఏసీబీ అధికారులు వివిధ ప్రాంతల్లో డీసీపీ నివాసాల్లో సోదాలు కొనసాగిస్తున్నారు. ఈ సోదాల్లో భారీగా ఆస్తులు ఉన్నట్లు బయటపడింది.