క్రైమ్/లీగల్

పబ్‌పై పోలీసుల దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, డిసెంబర్ 19: వినోదం మాటున అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారనే సమాచారంతో వెస్ట్‌జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు.. బేగంపేటలోని ఓక్లబ్ ఆవరణలోని పబ్‌పై దాడులు చేశారు. బుధవారం అర్ధరాత్రి టాస్క్ఫోర్స్ సీఐ గట్టుమల్లు ఆధ్వర్యంలోని పోలీసుల బృందం తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయాలు జరపడంతో పాటు విచ్చలవిడిగా కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు గుర్తించారు. పబ్ మేనేజర్ భరద్వాజ్, క్యాషియర్ శ్రీనివాస్‌తో పాటు 21 మంది యువతులను, తొమ్మిది మంది యువకులను అరెస్టు చేశారు. వీరి నుంచి లక్షా 47వేల రూపాయల నగదును సైతం స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. గతంలో ఇదే పబ్‌లో డ్యాన్సర్‌గా పనిచేసిన ఓ యువతి బలవంతంగా వ్యభిచారం చేయాలని ఒత్తిడిగా నిరాకరించడంతో బౌన్సర్లు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. తీవ్రమైన గాయాలతో సదరు యువతి పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేశారు. వీఐపీ జోన్‌లో పబ్‌లు, హుక్కా సెంటర్ల ముసుగులో జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.