క్రైమ్/లీగల్

అరోరా ఫెర్రోఅల్లాయిస్‌లో కార్మికుడు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొబ్బిలి, ఏప్రిల్ 27: పట్టణంలోని గ్రోత్‌సెంటర్‌లో ఉన్న అరోరా ఫెర్రోఅల్లాయిస్ పరిశ్రమలో పనిచేస్తున్న జి శంకరరావు(28) పనిచేస్తు ప్రమాదశాత్తు పరిశ్రమ పై నుంచి కిందపడి మృతిచెందాడు. ఈమేరకు గురువారం రాత్రి అరోరా ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలో బాయిలర్ పైకి శంకరరావు ఎక్కాడు. అక్కడ వేడిని తట్టుకోలేక పై నుంచి పడి అక్కడే మృతిచెందాడు. ఈమేరకు మండలం గొర్లె సీతారాంపురం గ్రామానికి చెందిన శంకరరావుకు భార్య రమణమ్మ, ఇద్దరు కుమార్తెలు వెంకటలక్ష్మి, పద్మలు ఉన్నారు. విషయం తెలిసిన వెంటనే కుటుంబీకులు, గ్రామస్థులు సంఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించారు. ఈమేరకు సీఐ మోహనరావు, ఎస్‌ఐ ప్రసాదరావులు ప్రమాద స్థలాన్ని పరిశీలించి యాజమాన్యం ద్వారా వివరాలు అడిగితెలుసుకున్నారు. కాగా బంధువులు, గ్రామస్థులు, సీటు నాయకులు శుక్రవారం పరిశ్రమ వద్ద ఆందోళన చేశారు. యాజమాన్యం భద్రతా చర్యలు తీసుకోలేదని, కార్మికులంటే లెక్కలేదని సీటు నాయకులు శంకరరావు, రెడ్డివేణులు ఆరోపించారు. ఈమేరకు కుటుంబానికి 40లక్షల రూపాయల నష్టపరిహారంతోపాటు ఫ్యాక్టరీలో ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు, యాజమాన్యం, సీటు నాయకులు, మెట్టవలస సర్పంచ్ మాదవ్‌లు ఈ విషయంపై చర్చలు జరిపిన అనంతరం పని చేస్తు చనిపోయిన కుటుంబానికి 8లక్షల రూపాయల నష్టపరిహారం, మృతదేహం దహన సంస్కరణలకు 50వేల రూపాయలు, ఇన్సూరెన్స్ 5లక్షల రూపాయలు చెల్లించేందుకు అంగీకరించారు. దీంతోపాటు 5లక్షల రూపాయలు చంద్రబీమా, పరిశ్రమలో ఒకరికి ఉద్యోగం ఇవ్వడానికి యాజమాన్యం అంగీకరించడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.