క్రైమ్/లీగల్

ప్రేమ విఫలమైందని యువకుడి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శాంతినగర్, ఏప్రిల్ 27: వడ్డేపల్లి మండల పరిధిలోని జక్కిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన మహేందర్(22) అనే యువకుడు అదే గ్రామానికి చెందిన నాగవేణి(19) అనే యువతిని ప్రేమించి పెళ్లిదాకా వచ్చి విఫలం కావడంతో శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నట్టు ఎస్‌ఐ మహేందర్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. అమ్మాయి కుటుంబ సభ్యులు ప్రేమించిన వాడిపై ఇష్టం లేక వేరే సంబంధం ఖాయం చేయడంతో ప్రేమించిన మహేందర్ జీవితంపై విరక్తి చెంది పురుగుల మందు తాగి మృతి చెందినట్టు తెలిపారు. మృతునికి తండ్రి హుస్సేన్, తమ్ముడు రాఘవేంద్ర ఉన్నారు. పెద్దనాన్న భీసన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
హల్‌చల్ చేస్తున్న మృతుడి ఆత్మహత్య వీడియో..
మహేందర్ చనిపోయే ముందు తన సెల్‌ఫోన్‌లో వీడియో చిత్రీకరించుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియోలో తాను ఒక అమ్మాయిని ప్రేమించానని, ఆమె తనను మోసం చేసి వేరే పెళ్లి చేసుకోబోతున్నదని, అమ్మాయి పెద్దమ్మ వీటన్నింటికీ కారణమని తనకు వారు చేతబడి చేయించారని మనస్తాపంతో పురుగుల మందు తాగి చనిపోతున్నానని మృతుడు పేర్కొన్నాడు.