క్రైమ్/లీగల్

పేలుడు పదార్ధాల విస్పోటనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగలాపురం, ఏప్రిల్ 28: అడవిపందులను అంతం చేయడానికి ఏర్పాటు చేసిన పేలుడు పదార్థాలు పేలడంతో ఇద్దరు ఉపాధి కూలీలు గాయపడిన సంఘటన శనివారం నాగలాపురం మండలం వెళ్లూరు గ్రామంలో జరిగింది. ఉపాధి కూలీల కథనం మేరకు వెళ్లూరు గ్రామ పంచాయతీకి చెందిన సుమారు 170మంది ఉపాధి కూలీలు వెళ్లూరు గ్రామ పరిధిలోని పరిగుంట వద్ద పంటకాలువ గుంతలు తీస్తున్న సమయంలో భూమిలో ఉన్న పేలుడు పదార్థాలు ఒక్కసారిగా పేలాయి. దీంతో సబితి (35) నిర్మల(45)లకు స్వల్పగాయాలు అయ్యాయి. వీరిని వెంటనే నాగలాపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం నగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిని ఉపాధిహామీ ఏపీఓ భార్గవి, ఈసీ సురేష్ తదితరులు పరామర్శించారు. ఈ విషయాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా ఏపీఓ భార్గవి మాట్లాడుతూ గాయపడిన ఇద్దరు కూలీలకు ప్రాణాపాయం లేదని, వారికి అవసరమైన వైద్యం ప్రభుత్వపరంగా అందిస్తామని చెప్పారు. ఈ పేలుడు పదార్థాలను ఎవరు అమర్చారనే విషయమై చర్చ జరుగుతోంది.