క్రైమ్/లీగల్

మనస్థాపంతో కానిస్టేబుల్ అదృశ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దఅడిశర్లపల్లి, ఏప్రిల్ 28: మండలంలోని గుడిపల్లి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ జూలకంటి సంతోష్‌రెడ్డి మనస్థాపంతో స్టేషన్‌లోనే లెటర్ వదిలి అదృశ్యమయ్యాడు. గుడిపల్లి ఎస్‌ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సంతోష్‌రెడ్డి విధుల అనంతరం శనివారం ఉదయం స్టేషన్‌లో లెటర్ రాసి వెళ్లాడు.
వివాహం జరిగి ఆరు సంవత్సరాలైందని, నాటి నుంచి సంతోషంగా లేకపోగా బాధతో ఉన్నానని, పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని లెటర్ రాసి వెళ్లాడు. అంతే కాకుండా తన సెల్‌ఫోన్‌తో పాటు ద్విచక్రవాహనాన్ని సైతం అక్కడినే వదిలి వెళ్లాడు. తండ్రి జూలకంటి వెంకట్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.