క్రైమ్/లీగల్

ఇసుక లారీల పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోస్గి, ఏప్రిల్ 28: ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా వాగు నుంచి ఇసుక రవాణా చేసి ఓ వ్యవసాయ పొలంలో డంప్ చేసి రాత్రివేళల్లో పలువురు స్థానిక అధికారుల అండదండలతో లారీలలో ఇసుక అక్రమంగా తరలిస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న ఈ వ్యవహారం ఆనోటా ఈనోటా జిల్లా అధికారుల దృష్టికి వెళ్లింది. వెంటనే రంగంలోకి దిగిన జిల్లా టాస్క్ఫోర్స్ బృందం శుక్రవారం అర్థరాత్రి దాటిన తర్వాత దాడులు నిర్వహించడంతో ఒక్కసారిగిగా నాలుగు లారీలు పట్టుబడ్డాయి. వికారాబాద్ జిల్లాలోని రంగంపల్లి, మెట్లకుంటలకు చెందిన లారీలు ఏపీ 29 వీ 4998, ఏపీ 29 యూ 2169, ఏపీ 29 డబ్ల్యూ 1889, ఏపీ 28 టీఈ 3138 నంబర్లు గల లారీలు అక్రమ ఇసుక వ్యాపారులు ఇసుక నింపి తీసుకెళ్తుండగా పట్టుకున్న టాస్క్ఫోర్స్ బృందం లారీలను పట్టుకున్నారు. వెంటనే స్థానిక పోలీసు స్టేషన్‌కు తరలించి సంబంధిత వ్యాపారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఒక్కో లారీ యజయానిపై లక్ష రూపాయల జరిమాన విధించినట్లు తహశీల్దార్ బాలచందర్ రావు తెలిపారు.