క్రైమ్/లీగల్

యాడికిలో చోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాడికి, ఏప్రిల్ 30 : మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి కాలనీలో రెండిళ్లు, మరువవంక సమీపంలోని మరో ఇంట్లో ఆదివారం అర్ధరాత్రి చోరీకి పాల్పడారు. ఈ చోరీలో దాదాపు 11 తులాల బంగారంతోపాటు 250 గ్రాముల వెండి, 2,500 నగదు చోరీకి గురైనట్లు స్థానిక పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల మేరకు ఆసుపత్రి కాలనీలోని చంద్రశేఖర్, పుల్లారెడ్డి ఇళ్లకు తాళం వేసి ఓ వివాహ వేడుకకు వెళ్లారు. దీంతో గుర్తు తెలియని దుండగులు చంద్రశేఖర్ ఇంట్లో జత కమ్ములు, రూ.వెయ్యి నగదు, పుల్లారెడ్డి ఇంట్లో రూ.1500 నగదు, జత కమ్ములను చోరీ చేశారు. అలాగే జిల్లా పరిషత్ పాఠశాల సమీపంలో మరవవంక వద్ద గుండానారాయణస్వామి ఇంటిపై నిద్రిస్తుండగా దొంగలు ఇంటి తాళాలు పగులగొట్టి బీరువాలో ఉన్న 10 తులాల బంగారు ఆభరణాలతోపాటు, 250 గ్రాముల వెండి వస్తువులు, కాలి గజ్జెలు చోరీ చేసినట్లు తెలిపారు. ఈమేరకు సోమవారం ఉదయం ఎస్సై కత్తి శ్రీనివాసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి అనంతపురం నుంచి క్లూస్ టీంను రప్పించి వేలి ముద్రలను సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ దర్యాప్తు చేస్తున్నారు.
నాలుగు వాహనాలు సీజ్
అనంతపురం అర్బన్, ఏప్రిల్ 30: ట్రాన్స్‌పోర్టు వాహనాల్లో ప్రయాణికులను తరలించకూడదని నిబంధనలు ఉన్నా, నిబంధనలు ఉల్లంఘించి ఓవర్ లోడ్‌తో ప్రయాణికులను తరలిస్తున్న నాలుగు వాహనాలను జాతీయ రహదారిపై సీజ్ చేసి కేసులు నమోదు చేసినట్లు మూడవ పట్టణ సీఐ మురళీకృష్ణ తెలిపారు. సోమవారం మూడవ పట్టణ సీఐ ఆధ్వర్యంలో జాతీయ రహదారి 44పై వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ తనిఖీల్లో ఓవర్ లోడ్‌తో ప్రయాణికులను తరలిస్తున్న ట్రాక్టర్, ఐచర్, బోలోరా, టాటాఎస్ వాహనాలను సీజ్ చేసి, కేసులు నమోదు చేయటం జరిగిందన్నారు. ప్రజలు సైతం ఇలాంటి వాహనాలను ఆశ్రయించ వద్దని ఆయన సూచించారు.

లైన్‌మెన్ మృతి
చెనే్నకొత్తపల్లి, ఏప్రిల్ 30 : అతిగా మద్యం సేవించి ఓ జూనియర్ లైన్‌మెన్ మృతి చెందిన సంఘటన చెనే్నకొత్తపల్లిలో సోమవారం జరిగింది. చెనే్నకొత్తపల్లి ఎస్‌ఐ మహమ్మద్ఫ్రీ తెలిపిన వివరాల మేరకు సీకేపల్లికి చెందిన పల్లెన్నగారిపల్లె భాస్కర్‌రెడ్డి (42) ఏపీ ఎస్‌పీడీసీఎల్‌లో జూనియర్ లైన్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అదేవిధంగా మద్యం ఎక్కువగా తీసుకుంటుండేవాడు. అయితే శనివారం కుటుంబ సభ్యులు ఓ కార్యక్రమానికి వెళ్ళారు. అయితే శనివారం అతిగా మద్యం సేవించి ఇంటిలోనే వున్నాడు. సోమవారం ఉదయం అయినప్పటికీ బయటికి రాకపోవడంతో చుట్టుపక్కల వారు గమనించి తలుపులను పగులకొట్టారు. దుర్వాసన వెదజల్లుతుండడంతో మృతి చెందాడని స్థానికులు పేర్కొన్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.