క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పొదిలి, మే 1: రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి దుర్మరణం చెందగా, మరొకరికి తీవ్ర గాయాలైన సంఘటన పొదిలి మండలంలోని అక్కచెరువు గ్రామ సమీపంలో మంగళవారం రాత్రి జరిగింది. ఆ గ్రామానికి చెందిన ఎం రమణయ్య (43) మరియు అమ్మిరెడ్డి అనే ఇద్దరు మోటార్ సైకిల్‌పై పొదిలి వైపు వస్తుండగా మార్గమధ్యంలో ఎదురుగా వస్తున్న ఆటో ఢీకొంది. ఈ ప్రమాదంలో రమణయ్య అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. వెనుక కూర్చొని ఉన్న అమ్మిరెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని తీవ్రంగా గాయపడ్డ అమ్మిరెడ్డిని పొదిలి ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఒంగోలుకు తరలించారు. ఈ సంఘటనపై పొదిలి ఎస్‌ఐ జె నాగరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.