క్రైమ్/లీగల్

భార్యను హత్య చేసి ఆత్మహత్యకు పాల్పడ్డ భర్త

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శంకరపట్నం, మే 1: శంకరపట్నం మండలంలోని కేశవపట్నం గ్రామంలో భార్యపై అనుమానంతో ఓ భర్త గొడ్డలితో భార్యను నరికి చంపిన సంఘటన ఇది. పోలీసుల కథనం ప్రకారం..కేశవపట్నంకు చెందిన దుర్గం తిరుపతి, ధనలక్ష్మి అనే దంపతులకు కుమారుడు గణేష్, కూతురు నిహారికలు ఉన్నారు. కడు పేదరికంతో కూలీ పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న క్రమంలో భర్త తిరుపతికి భార్య ధనలక్ష్మిపై అక్రమ సంబంధం అనే అనుమానం మొదలు కావడంతో తరచు భార్యా,్భర్తల మధ్య గొడవలు జరుగుతుండేవని, దీంతో సోమవారం వీరి బంధువు మృతి చెందగా, అంత్యక్రియలో పాల్గొని తిరిగి కేశవపట్నానికి చేరుకున్నాడు. తిరుపతి తరచు మద్యం సేవిస్తుండేవాడని, సోమవారం రాత్రి చిన్నపాటి గొడవ జరుగుతుండగా కుమారుడు గణేష్, కూతురు నిహారికలు తల్లిదండ్రులను నచ్చజెప్పి గొడవలకు దిగవద్దని చెప్పి ఇదే గ్రామంలో గణేష్ తన చెల్లితో వారి అత్తవారింటికి వెళ్లి పడుకోవడంకు వెళ్లారు. దంపతులిద్దరు తిరుపతి-్ధనలక్ష్మిలు మంగళవారం ఉదయం శవమై కన్పించారు. భార్యను భర్త ఇంటిలో ఉన్న గొడ్డలితో మెడపై నరకడంతో పెద్దమొత్తంలో రక్తపు మడుగులు ఏర్పడి మృతదేహం మంచంలో పడి ఉంది. భర్త తిరుపతి ఇంటి సమీపంలో పురుగుల మందు సేవించి శవమై కన్పించాడు. కాగా, తిరుపతి చనిపోయే ముందు తాను కొందరి వద్ద అప్పు చేశానని, వారికి వరి కోతల అనంతరం చెల్లించాలని, అలాగే తనకు కొందరు వ్యక్తులు డబ్బులు ఇవ్వాలని, నా భార్య ధనలక్ష్మి అక్రమ సంబంధం ఏర్పర్చుకొందని ఎన్నిసార్లు చెప్పినప్పటికినీ వినిపించుకోవడం లేదంటూ సూసైడ్ నోట్ రాసి మృతుడు తిరుపతి జేబులో కనిపించింది. ఉదయానే్న తన వరి పొలం కోసేందుకు వెళ్దామని ఇదే గ్రామానికి చెందిన బాడిసె పోచయ్య అనే వ్యక్తి తిరుపతి ఇంటికి వెళ్లి చూడగా దంపతులిద్దరు శవాలై కనిపించడంతో పరిసర ప్రాంతాల వారికి, పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి కరీంనగర్ అడిషనల్ డీసీపీ సంజీవ్ కుమార్, హుజూరాబాద్ ఎసీపీ కృపాకర్, హుజూరాబాద్ రూరల్ సిఐ రవి కుమార్, ఎస్‌ఐ ఎల్లాగౌడ్‌లు సంఘటనా స్థలానికి చేరుకొని పరిసరాలను పరిశీలించి సూసైడ్ నోట్‌ను, ఫిర్యాదును కుమారుడు గణేష్ ద్వారా తీసుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ ఎల్లాగౌడ్ తెలిపారు. కాగా, మృతదేహాలను హుజూరాబాద్ ప్రభుత్వాసుపత్రిలో మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పరిశీలించి జరిగిన తీరును టిఆర్‌ఎస్ నాయకులు మోత్కూరి సమ్మయ్య, గుర్రం శ్రీకాంత్ గౌడ్‌ను అడిగి తెలుసుకొని సంతాపం వ్యక్తం చేశారు. కేశవపట్నంలో ఈ సంఘటన చర్చనీయాంశంగా మారింది. ఉదయం 7 లోపే పోలీసుల సైరన్‌లతో వాహనాలు కాలనీ వైపు వెళ్తుండగా గ్రామస్థులు గ్రామంలో ఏం జరిగిందోనని ఆందోళనకు గురయ్యారు. దీంతో సమాచారం తెలుసుకొని గ్రామస్థులు కొందరు మృతదేహాలను చూసేందుకు తరలివెళ్లారు.