క్రైమ్/లీగల్

తల్లిని చంపిన తనయుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చేర్యాల, మే 15: డబ్బులు, బంగారం ఇవ్వలేదంటూ తల్లిని తనయుడు చంపిన సంఘటన చేర్యాలలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంగళవారం చేర్యాల సీఐ రఘు విలేకరులతో సమావేశంలో తెలిపిన వివరాల ప్రకారం... కొమురవెళ్లి మండలం గురువన్నపేట గ్రామానికి చెందిన బండారి గౌరమ్మ(75)ను ఆమె పెద్దకొడుకు కొండయ్య మధ్యం మత్తులో చంపినట్లు తెలిపారు. జనవరి 22 రాత్రి మధ్యం తాగి ఇంటికి వచ్చిన కొండయ్య తల్లి గౌరమ్మను బంగారం, డబ్బులు అడగగా.. అందుకు ఆమె నిరాకరించగా ఆమెను నెట్టివేయడంతో గాయాలై మృతి చెందింది. దీంతో ఎవరికీ తెలియకుండా ఆమెను పూడ్చి పెట్టాడు. మరుసటి రోజున తల్లి కనబడడం లేదంటూ తమ్ముడితో కలిసి పోలీసు స్టేషన్‌లో ఏమీ తెలియనట్లు ఫిర్యాదు చేశారని తెలిపాపరు. అయితే... గత నెల 24వ తేదీన గ్రామంలోని చెరువువద్ద ఆమె మృతదేహపు ఆనవాళ్లు కనపించగా ఆమె చీరను గమనించి తమ తల్లిగా కొడుకులు గుర్తించారు. కాగా... ప్రమాదవశాత్తు జరిగినట్లుగా పోలీసులు భావించి కేసు నమోదు చేశారు. అయితే... మంగళవారం రోజున అమె పెద్దకొడుకు కొండయ్యపై అనుమానం వచ్చి అరెస్టుచేసి పోలీసులు తమదైన శైలిలో ఆరాతీయగా జరిగిన విషయాన్ని పొలీసులకు తెలిపాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు. ఈ సందర్భంగా కొమురవెళ్లి ఎస్సై సతీష్ ఉన్నారు. మృతురాలికి ఇద్దరు కొడుకులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.