క్రైమ్/లీగల్

మతిస్థిమితం లేని బాలికపై వృద్ధుడి అత్యాచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాచవరం, మే 15: మతిస్థిమితం లేని మైనర్ బాలికపై వృద్ధుడు అత్యాచారం చేసిన సంఘటన గుంటూరు జిల్లా మాచవరం మండలం మోర్జంపాడు గ్రామంలో మంగళవారం జరిగింది. మోర్జంపాడు గ్రామానికి చెందిన 16 సంవత్సరాల బాలిక మతిస్థిమితం లేకపోవడంతో ఇంటి వద్దనే ఉంటుంది. ఇది గమనించిన గ్రామానికి చెందిన 60ఏళ్ళ తుమ్మా వీరయ్య బాలికపై కన్ను వేశాడు. ఇంటి వద్దనే ఉన్న చిన్నారికి మాయమాటలు చెప్పి, తన ఇంటికి తీసుకెళ్ళి అత్యాచారం చేశాడు. ఇంటికి తిరిగి వచ్చిన బాలికను తల్లి గమనించి, ఏం జరిగిందని అడిగినా చెప్పే స్థితిలో బాలికలేకపోవడంతో అర్థం చేసుకున్న తల్లి మళ్ళీ అడుగగా తాతయ్య ఇలా చేశాడని తల్లిదండ్రులకు బాలిక వివరించింది. వెంటనే బాలిక తల్లిదండ్రులు స్పందించి, వీరయ్యకు దేహశుద్ధి చేసి, స్థానిక పోలీస్ స్టేషన్‌లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్‌ఐ జగదీష్ కేసు నమోదు చేసుకుని, విచారణ చేపట్టారు.