క్రైమ్/లీగల్

కిడ్నాపర్ల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనగిరి, మే 17 : మండలంలోని అనాజీపురం గ్రామ శివారులో నివాసం ఉంటున్న సైదాచారిని కిడ్నాప్ చేసి 50లక్షలు డిమాండ్ చేసిన కిడ్నాపర్లను పోలీసులు వలపన్ని పట్టుకున్నట్లుగా డీసీపీ రామచంద్రారెడ్డి తెలిపారు. భువనగిరి రూరల్ పోలీస్ స్టేషన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి కిడ్నాప్ ఉదంతాన్ని వివరించారు. సైదాచారి గతంలో యశోదమ్మ భర్త వెంకట్‌రెడ్డి, మరో మహిళ అనితల వద్ద అత్యధికంగా వడ్డీ చెల్లిస్తానని నమ్మబలికి 70లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నట్లుగా తెలియజేశారు. అందులో సగ భాగం 35లక్షల రూపాయలు అప్పు తీర్చిన సైదాచారి మిగతా డబ్బు చెల్లించకపోవడంతో డబ్బులు వసూలు చేసి ఇచ్చేందుకు ఖమ్మం జిల్లా కేంద్రానికి చెందిన కొనకండ్ల సురేష్‌ను, హబ్సీగూడకు చెందిన తాడోజు నాగరాజును ఆశ్రయించినట్లుగా తెలిపారు. ఈ సందర్భంగా సైదాచారి వద్ద డబ్బులు ఉన్నట్లుగా తెలుసుకున్న కొనకండ్ల సురేష్, నాగరాజుతో పాటు మరో ఐదుగురు వ్యక్తులను కలుపుకొని సైదాచారిని మే 10న కిడ్నాప్ చేసి తమ ఐ20 కారులో తిప్పుతూ వారం రోజులుగా వలిగొండ మీదుగా తొర్రూరుకు తరలిస్తు 50లక్షల రూపాయలు ఇస్తే విడిచిపెడతామని బేరం కుదుర్చుకున్నారని పోలీసులు తెలిపారు. దీనితో 50 లక్షలు ఇచ్చేందుకు ఒప్పుకున్న సైదాచారి అనాజీపురంకు తీసుకెళ్లారు. అనుమానస్పద స్థితిలో వాహనంలో తిరుగుతున్న వారిని ఆపి పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో కిడ్నాప్ ఉదంతం వెలుగు చూసింది. కిడ్నాప్‌కు గురైన సైదాచారి ఫిర్యాదు మెరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టగా సైదాచారితో పాటు నిందితులు కొనకండ్ల సురేష్, కటిక మహేష్, రాజ ప్రేమ్‌కుమార్, ఎటుకూరి కిషోర్, ఎస్‌కే. యాకూబ్, ఏశం లక్ష్మణ్‌లను అదుపులోకి తీసుకోగ మరో నిందితుడు తాడోజు నాగరాజు పరారైనట్లుగా తెలిపారు. నిందితుల వద్ద నుండి ఐ20 కారుతో పాటు, 2 వాహనాలు, ఒక ల్యాప్‌టాప్, 3 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకొని నిందుతులను కోర్టుకు హాజరుపరుస్తున్నట్లుగా తెలియజేశారు.
చిత్రం..కిడ్నాప్ ఉదంతాన్ని మీడియాకు వివరిస్తున్న డీసీపీ రామచంద్రా రెడ్డి