క్రైమ్/లీగల్

కావేరీ స్కీంకు సుప్రీం ఆమోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 18: నాలుగు దక్షిణాది రాష్ట్రాల మధ్య జల పంపిణీకి ఉద్దేశించిన కావేరీ యాజమాన్య స్కీం ముసాయిదాను సుప్రీం కోర్టు ఆమోదించింది. కేంద్రం రూపొందించిన ఈ పథకంలో కొన్ని మార్పులు చేయాలంటూ కర్నాటక, కేరళ ప్రభుత్వాలు చేసిన సూచనలను చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా సారథ్యంలోని సుప్రీం ధర్మాసనం తిరస్కరించింది. ఈ రాష్ట్ర ప్రభుత్వాల సలహాల్లో ఎలాంటి పసా లేదని బెంచ్ వ్యాఖ్యానించింది. కావేరీ జలాల వివాదాల ట్రిబ్యునల్ అవార్డులో అత్యున్నత న్యాయస్థానం చేసిన మార్పులను పరిగణనలోకి తీసుకుని ఈ పథకాన్ని అమలు చేయాలని జస్టిస్ ఏఎం కన్విల్కర్, జస్టిస్ డివై చంద్రచూడ్‌లతో కూడిన త్రిసభ్య బెంచ్ ఆదేశించింది. కావేరీ పథకాన్ని ఖరారు చేయనందుకు కేంద్రంపై ధిక్కార చర్యలు చేపట్టాలంటూ తమిళనాడు చేసిన వాదనను సుప్రీం కోర్టు కొట్టివేసింది. కావేరీ ముసాయిదా పథకం తామిచ్చిన తీర్పునకు అనుగుణంగా ఉందని స్పష్టం చేసిన న్యాయస్థానం, ‘ఈ విషయాన్ని మేము స్పష్టంగా తెలియచేస్తున్నాం’ అని పేర్కొంది. సుప్రీం కోర్టు ఆమోదించిన నేపథ్యంలో ఈ పథకాన్ని కేంద్రం ఖరారు చేస్తే అన్ని రకాల పరిస్థితుల్లోనూ కావేరీ జలాల పంపిణీకి సంబంధించిన సమస్యలు తీరే అవకాశం ఉంటుంది. 2007లోనే కావేరీ ట్రిబ్యునల్ అవార్డును సవరించిన సుప్రీం కోర్టు, ఇందుకు సంబంధించిన గడువును ఎట్టి పరిస్థితుల్లోనూ పొడిగించేది లేదని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఆ తీర్పుద్వారా కావేరీ జలాల్లో కర్నాటక వాటాను 270 శతకోటి ఘనపుటడుగులకు పెంచడంతోపాటు తమిళనాడు వాటాను తగ్గించింది. తమిళనాడుకు కలిగే నష్టాన్ని పరీవాహక ప్రాంతంలోని భూగర్భ జలాలను పది శతకోటి ఘనపుటడుగుల మేర కేటాయించటం ద్వారా భర్తీ చేసింది. ప్రజల సాగునీటి అవసరాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొంది.