క్రైమ్/లీగల్

రేణిగుంటలో రోడ్డు ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేణిగుంట, మే 20: చిత్తూరు జిల్లా రేణిగుంట మండలంలోని మామండూరు సమీపంలో ఆదివారం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఒక చిన్నబాబుతో పాటు ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. మృతులు ప్రయాణిస్తున్న వాహన డ్రైవర్ కరీముల్లా పరిస్థితి విషమంగా ఉంది. మృతి చెందినవారంతా కర్నూలు జిల్లాకు చెందిన ఒకే కుటుంబం వారని పోలీసుల విచారణలో తేలింది. స్వామివారి దర్శనానికి వెళుతుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో వీరంతా మృతి చెందారు. వివరాల్లోకెళితే.. కర్నూలు జిల్లా గడివేముల మండలం కరటముడి గ్రామానికి చెందిన నాగరాజు శెట్టి, ప్రవీణ్‌కుమార్ కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకోవడానికి శనివారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో తమ స్వగ్రామం నుంచి తుఫాన్ మాక్స్ వాహనంలో తిరుమలకు బయలుదేరారు. ఆదివారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో సిమెంటు బస్తాలు తీసుకెళుతున్న ఓ మినీలారీని వేగంగా ఢీకొంది. ఈ సంఘటనలో మినీలారీ రోడ్డుపై బోల్తాపడగా భక్తులు ప్రయాణిస్తున్న జీపు పొదల్లోకి దూసుకెళ్లిపోయింది. అతివేగంగా
ఢీకొనడంతో తుఫాన్ మాక్స్ జీపు పూర్తిగా ధ్వంసమైంది. ఇందులో ఉన్న నాగరాజు శెట్టి (55), రమాదేవి (50), నారాయణమ్మ (70), ప్రవీణ్‌కుమార్ (32), దేవనాష్ (ఒకటిన్నర సంవత్సరం) అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న రేణిగుంట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వాహనంలో ఇరుక్కుపోయిన మృతదేహాలను అతి కష్టంమీద బయటకు తీశారు. ఈ ప్రమాదంలో గాయాలపాలైన మధు జయకుమార్, రేణుక, తనిష్, సురేంద్ర, జీప్ డ్రైవర్ కరీముల్లాతో పాటు సిమెంటు తీసుకెళ్తున్న వాహనం డ్రైవర్ కృష్ణను రుయా ఆసుపత్రికి తరలించారు. జీప్ డ్రైవర్ కరీముల్లా పరిస్థితి విషమంగా ఉందన్నారు. ప్రమాదం జరిగిన తీరుచూస్తే రాత్రి నుంచి విశ్రాంతి లేకుండా డ్రైవర్ వాహనాన్ని నడపడంతో నిద్రమత్తులో వేగాన్ని అదుపు చేయలేక ఎదురుగా వస్తున్న వ్యాన్‌ను ఢీకొనడంతో మినీ లారీ కూడా రోడ్డుపై బోల్తా పడిన పరిస్థితి కనిపిచిందని పోలీసులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న రేణిగుంట సీఐ నాగరాజ యాదవ్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చిత్రం..రేణిగుంట- మామండూరు సమీపంలో రోడ్డుప్రమాద దృశ్యం