క్రైమ్/లీగల్

హత్యచేసింది ఒకరైతే..లొంగిపోయింది మరొకరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరిసిల్ల, మే 22: జిల్లాలో సంచలనం రేపిన మూడపల్లి గ్రామ సర్పంచ్ గోలి శంకర్ హత్య కేసును రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు ఛేదించారు. ఈ మేరకు మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ రాహుల్ హగ్డే నిందుతులను ప్రవేశపెట్టి వివరాలను వెల్లడించారు. ఈ హత్యోదాంతంలో కళ్లు బైర్లు కమ్మే నిజాలు వెల్లడయ్యాయి, అసలు దోషిని తప్పించేందుకు పక్కా స్కెచ్ వేసి హత్య చేసింది ఒకరైతే మరొకరు లొంగిపోయిన తీరు పోలీసులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ నెల 13న హన్మక్కపల్లె గ్రామ శివారులో మూడపల్లి సర్పంచ్ గోలి శంకర్ హత్యకు గురి కావడంతో కేసు నమోదు చేసి పరిశోధన మొదలుపెట్టిన వేములవాడ టౌన్ పోలీసుల ముందు మంగళవారం తామే హత్యచేశామంటూ కడారి మహేందర్, నేదురి రాజేష్, బైరెడ్డి వినయ్, ఎడపల్లి విష్ణులు లొంగిపోయారు. నిందుతులను పోలీసులు తమదైన పద్ధతిలో విచారణ చేపట్టగా పక్కా పథకం ప్రకారమే హత్య చేసినట్లు వెల్లడయింది. హంతకులలో ఒకరైన చొప్పరి శివను కేసు నుండి తప్పించడానికి నింధితులు సినీ ఫక్కీలో పథకం పన్నారు, లక్ష రూపాయలకు ఒప్పందం కుదుర్చుకుని హంతకుడు శివ స్థానంలో బైరెడ్డి వినయ్ అనే వ్యక్తిని జైలుకు వెళ్లేందుకు ఒప్పించి పోలీసుల ముందు స్వతహాగా లొంగిపోయేలా పథకం పన్నారు. పోలీసుల విచారణతో బెదిరి పోయిన వినయ్ నిజం వెల్లగక్కడంతో పోలీసులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. కాగా హత్యకేసులో ప్రధాన సూత్రదారైన కడారి తిరుపతి ఎనిమిది సంవత్సరాల క్రితం తన చెల్లెల్ని మూడపల్లి గ్రామస్తుడైన గోలి తిరుపతికి ఇచ్చి వివాహం జరిపించాడు. పెళ్లి జరిగిన కొద్ది రోజులకే గోలి తిరుపతి విదాశాలకు వెల్లడంతో గోలి శంకర్ వరుసకు బావ కావడంతో తిరుపతి చెల్లెలితో చనువు పెంచుకున్నాడు. అదిగమనించిన తిరుపతి అతని తమ్ముడు మహేందర్‌లు గోలి శంకర్‌తో తరుచు గొడవ పెట్టుకున్నారు. తిరుపతి ప్రేమ పెళ్లి విషయంలో కూడా జోక్యం చేసుకుని ఇబ్బందులకు గురి చేయడం, తన చెల్లెలితో అక్రమ సంభందం కొనసాగిస్తున్నడనే అనుమానంతో తిరుపతి అతని తమ్ముడు మహేందర్‌లతో కలిసి శంకర్‌ను హత్య చేశారు. ముందుగా అనుకున్న పథకం ప్రకారం తిరుపతి అరోగ్య చికిత్సకోసం తాను కేరళ వెళుతున్నట్టు వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్‌లో నాలుగవ తేదీన లెటర్ అందించి మరుసటి రోజు తమ్ముడు మహేందర్‌తో కలిసి హైద్రాబాద్ వెళ్లాడు. అన్న తిరుపతిని హైద్రాబాద్‌లో దింపిన మహేందర్ తిరిగి వచ్చే క్రమంలో కూకట్‌పల్లి నిజాంపేట వద్ద మూడు వేట కొడవళ్లను కొనుగోళు చేసి వాటిని బ్యాగ్‌లో దాచాడు. తన అనుచరులైన చొప్పరి శివ, నిదురి రాజేష్‌ల సహాయంతో హత్య చేయడానికి ప్రణాళిక రూపొందించారు. ముందుగా అనుకున్న ప్రకారం హత్యకు ఐదు ప్రాంతాలను ఎంచుకున్నారు అవి 1) గోలి శంకర్ ఇంటి వద్ద కారు షెడ్ వద్ద కారు పార్క్ చేసి ఇంటిలోకి వెల్లె సమయం 2) మూడపల్లి ఎల్లమ్మ దేవాలయం 3) కోనాయిపల్లె రోడ్డు 4) కోరుట్ల బస్టాండ్ వద్ద 5) ఏదైన కాళీగా ఉండే సింగిల్ లేన్ రోడ్డు లను ఎంచుకుని కారులో రిక్కి నిర్వహించారు. ఈ నెల 11న ఎల్లమ్మ దేవాలయం వద్ద హత్యకు మాటు వేసినప్పటికి శంకర్ తప్పించుకున్నాడు. కాగా 13న నూకలమర్రిలో జరిగే కబడ్డి పోటీలకు గోలి శంకర్ హజరుకానున్నడనే పక్కా సమాచారంతో రాజేష్ హన్మక్కపల్లి కోళ్లఫాం వద్ద మహేందర్‌ను శంకర్ కదలికలను తెలపాల్సిందిగా నూకలమర్రి పంపాడు. పోటీల అనంతరం శంకర్ తన కారులో మూడపల్లికి బయలు దేరగా మహేందర్ బైక్‌పై శంకర్‌ను ఫాలో అవుతూ రాజేష్‌కు ఎప్పటికప్పడు సమాచారాన్ని చేరవేసాడు. శంకర్ కారు కోళ్ళఫాం వద్దకు రాగానే రాజేష్ తన కారుతో శంకర్ కారును డీ కొట్టాడు, ఏం జరుగుతోందో తెలియని శంకర్ కారు దిగడంతో శివ తన వద్ద ఉన్న పెప్పర్ స్ప్రేను శంకర్ మొహంపై చల్లడంతో శంకర్ కుప్పకూలి పోయాడు. ఇదే అదునుగా బావించిన రాజేష్, మహేందర్ తమ వద్ద వున్న వేట కొడవల్లతో దాడిచేయగా తీవ్ర గాయాలైన గోలి శంకర్ అక్కడికక్కడే మృతి చెందాడు. అటుగా వస్తున్న ప్రయాణికులను సైతం వేట కొడవళ్ళతో బెదిరించి ద్విచక్ర వాహనంపై పరారయ్యారు.
పరారీలో నలుగురు నిందితులు
ఎనిమిది మంది నిందితుల్లో కడారి మహేందర్, నేదురి రాజేష్, బైరెడ్డి వినయ్, ఎడపల్లి విష్ణులను అదుపులోకి తీసుకోగా మరో నలుగురు నిందితులు కడారి తిరుపతి, చొప్పరి శివ, గంగారాజు, మహేష్‌లు పరారీలో ఉన్నారు. సంఘటనా స్థలంలో ఇండికా కారు, రెండు వేట కొడవళ్లు, పెప్పర్ స్ప్రే బాటిల్‌ను లభించగా నిందితుల వద్ద నుండి నాలుగు సెల్ ఫోన్లు, ద్విచక్ర వాహనం, ఒక వేట కొడవలి స్వాధీనం చేసుకున్నారు. హత్యకేసులో అసలు నేరస్తుడైన చొప్పరి శివను తప్పించేందుకు తన స్థానంలో లొంగిపోయి కేసును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించిన బైరెడ్డి వినయ్‌పై కూడా కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ , డీఎస్పీ వెంకటరమణ, వేములవాడ టౌన్ సీఐ పాల్గొన్నారు.