క్రైమ్/లీగల్

ఇత్తడికి బంగారు మాయ మాటలతో మోసం చేసిన ముగ్గురు అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మే 26: నకిలీ బంగారు పూత ఉన్న ఇత్తడి చూపి అసలు బంగారమని నమ్మించి ప్రజలను మోసం చేసి తప్పించుకు తిరుగుతున్న ముఠాలోని ముగ్గురు వ్యక్తులను తిరుపతి క్రైం పోలీసులు శుక్రవారం తిరుపతి బాలజీ కాలనీ సర్కిల్ వద్ద అరెస్ట్‌చేసినట్లు తిరుపతి క్రైం డీఎస్పీ రవిశంకర్ రెడ్డి తెలిపారు. శనివారం క్రైం పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వాయల్పాడు మండలానికి చెందిన కృష్ణారెడ్డిగారి కృష్ణారెడ్డి, కలికిరి మండలం మల్లిరెడ్డిపల్లిగారి గ్రామంకు చెందిన బి. వెంకటశివారెడ్డి, గుడేవాండ్లపల్లికి చెం దిన లక్ష్మీరెడ్డిలు తిరుపతి, చిత్తూరు, గుంటూరు, విజయవాడ, నల్గొండ, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా లాంటి అనేక పెద్ద పెద్ద నగరాల్లో గత ఆరు సంవత్సరాలుగా సంచరిస్తూ ప్రజల్లో ఉన్న అమాయకత్వాన్ని, అత్యాసను ఆసరాగా తీసుకొని నకిలీ బంగారును తెచ్చి నగదు తీసుకొని మోసం చేశావాడన్నారు. కృష్ణారెడ్డి వాయల్పాడులో వ్యవసాయం చేసుకునే ఒక రైతు అన్నారు.వర్షాలు లేక పంటలు పండకపోవడంతో దుర్వ్యసనాలకు అలవాటు పడ్డారన్నారు. ఈ క్రమంలో ఇతర ప్రాంతాలలో తిరిగితూ తన మాటల చాతుర్యంతో ప్రజల అమాయకత్వం, బలహీనతలు, దురాశను ఆసరగా చేసుకొని వారితో స్నేహం కలిపేవాడన్నారు. ఈక్రమంలో వెంకటశివారెడ్డి, లక్ష్మీరెడ్డిలతో కూడా కలిసి మోసాలకు తెగబడుతూ వచ్చారన్నారు. ఈ క్రమంలో కొత్తగా పరిచయమైన అమాయకులతో స్నేహం కలిపినపుడు తమ ఊరిలో పొలంలో తవ్వుతున్నపుడు లంకెబిందెలు దొరికాయని, అందులో బంగారు ఉందని నమ్మబలికేవాడు. పరిచయమైన వారి పరిస్థితిని బట్టి కేజీ బంగారును రూ.2లక్షల నుంచి రూ.10లక్షల వరకు విక్రయించేవారని, ముందుగా అసలు నాణేలు చూపించి వాటిని పరీక్షించుకోమని నమ్మించి ఆపై నకిలీ బంగారు ఇచ్చి సొమ్ము దోచుకొని వెళ్లేవాడన్నారు. ఈక్రమంలో తిరుపతిలో ఫోన్ ద్వారా పరిచయమైన జానకీరామ్ అనే వ్యక్తిని కృష్ణారెడ్డి మోసం చేశారన్నారు. తిరుపతికి వచ్చి తన వద్ద ఉన్న 5 అసలు నాణ్యాలను చూపించి ఇవి భూమి తవ్వకాలలో తమ బంధువుల పొలం లో బయటపడ్డాయని నమ్మించారన్నా రు. అటు తరువాత అతని వద్ద నుంచి రూ.1లక్ష అడ్వాన్స్ తీసుకున్నాడన్నారు. వారం తరువాత ఫోన్‌చేసి తక్కిన డబ్బులను తీసుకుని వాయల్పాడుకు రమ్మని జానకిరామ్‌కు సూచించారు. దీంతో దురాశకు లోనైన జానకిరామ్ రూ.10లక్షల నగదు తీసుకొని వాయల్పాడుకు వెళ్లి కృష్ణారెడ్డిని కలిశారన్నారు. కృష్ణారెడ్డి, స్నేహితుడైన శివారెడ్డి, లక్ష్మీరెడ్డిలు ఉన్న గదికి తీసుకెళ్లి జానకిరామ్‌ను, అతని స్నేహితుడు వెం కటేష్‌లను పరిచయం చేశారు. అనంతరం ఒక గదిలో నుంచి బంగారు వస్తుందని, ఇక్కడే ఉండమని ముగ్గురు మాయగాళ్లు వెలుపలకు వచ్చి తమ వద్ద ఉన్న సెల్‌ఫోన్‌లు స్విచ్చ్ఫా చేసి రూ.11 లక్షలు తీసుకొని పారిపోయారన్నారు. అటు తరువాత అందులో శివారెడ్డి రూ.1.20లక్షలు తన ఇంటి వద్ద ఉంచారన్నారు. అటు తరువాత ఒక్కొక్కరికి రూ.60వేలు చొప్పు న పంచుకొని డబ్బులను జల్సాగా ఖర్చుపెట్టుకున్నారన్నారు. జానకి రామ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసును నమోదుచేసి దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో ముగ్గురు మాయగాళ్లు తిరుపతి బలాజీ కాలనీ సర్కిల్‌లో తచ్చాడుతుండగా అనుమానించి పట్టుకున్నారన్నారు. వీరి వద్ద నుంచి రూ.10.20లక్షల నగదు, 2 గ్రాముల బంగారును స్వాధీనం చేసుకొని అరెస్ట్‌చేసి రిమాండుకు పంపడం జరిగిందన్నారు. వీరితో పాటు మరికొంతమంది కూడా ఉన్నారని,వారిని కూడా త్వరగా అరెస్ట్‌చేస్తారన్నారు. నకిలీ బంగారు ముఠాను అరెస్ట్‌చేయడంలో తిరుపతి క్రైం సీఐ అబ్బన్న, ఎస్‌ఐ రమేష్‌బాబులు, వారి సిబ్బంది విశేష ప్రతిభ కనబరిచారని, వారిని అభినందించడం కోసం వారికి రివార్డులను అందించాలని ఎస్పీ అభిషేక్ మహంతికి ప్రతిపాదనలు పంపామన్నారు.