క్రైమ్/లీగల్

మరణశిక్ష అమలుపై సుప్రీం స్టే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 27: మధ్యప్రదేశ్‌లో 11 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడి పాశవికంగా హత్య చేసిన ఘటనలో నిందితులకు హైకోర్టు మరణశిక్షను ఖరారు చేస్తూ ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టు స్టే విధించింది. ఈ కేసులో జస్టిస్ ఎఎం ఖాన్వికర్, జస్టిస్ ఇందూ మల్హోత్రతో కూడిన ధర్మాసనం మధ్యప్రదేశ్ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో దిగువ కోర్టు నిందితులు భగ్వాని, సతీష్‌లకు మరణ శిక్షను ఖరారు చేసింది. ఈ తీర్పును సవాలు చేస్తూ నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఈ నెల 9వ తేదీన నిందితులకు మరణ శిక్షను విధిస్తూ దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. దీంతో నిందితుల్లో ఒకరైన భగ్వాని హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీం కోర్టు మరణ శిక్ష అమలుపై స్టే విధించింది, ఈ కేసుకు సంబంధించి హైకోర్టు రికార్డులను తమకు సమర్పించాల్సిందిగా సుప్రీంకోర్టు మధ్యప్రదేశ్ పోలీసులను ఆదేశించింది. ఈ కేసులో నిందితులు తాము నివసిస్నున్న గ్రామంలోనే కుటుంబ సభ్యులతో ఉంటున్న మైనర్ బాలికపై గత ఏడాది ఏప్రిల్ 14వ తేదీ రాత్రి దారుణానికి ఒడిగట్టారు. అత్యాచారం తర్వాత హత్య చేశారు. తల్లితండ్రులతో కలిసి ఆ బాలిక గ్రామంలో ఒక ఉత్సవానికి వెళ్లింది. అక్కడి నుంచి ఆ బాలిక అదృశ్యమైంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుమేరకు పోలీసులు దర్యాప్తు చేయగా బాలిక అత్యాచారం, హత్యకు గురైనట్లు తేలింది. ఘటన జరగకముందు బాలిక తండ్రితో నిందితులు ఘర్షణ పడినట్లు పోలీసులు అభియోగపత్రంలో పేర్కొన్నారు.