క్రైమ్/లీగల్

సీబీఐ విచారణకు చిదంబరం గైర్హాజరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 31: కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరం ఐఎన్‌ఎక్స్ మీడియా అవినీతి కేసులో విచారణకు గైర్హాజరయ్యారు. గురువారం ఆయన సీబీఐ కోర్టుకు హాజరు కావల్సి ఉంది. చిదంబరం ను ప్రశ్నించాల్సి ఉండగా కోర్టుకు రాలేదు. అయితే చిదంబరం గైర్హాజరుకు సంబంధించి సంబంధిత అధికారుల నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఐఎన్‌ఎక్స్ మీడియా అవినీతికి సంబంధించి మే 15న సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఐఎన్‌ఎక్స్‌కు విదేశీ నిధులు వచ్చేలా ఎఫ్‌ఐపీబీ క్లియరెన్స్ ఇచ్చారన్నది ఆరోపణ. ఆ సంస్థకు 2007లో 305 కోట్ల విదేశీ నిధులు వచ్చాయి. ఆ సమయంలో చిదంబరం కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్నారు. అలాగే ఐఎన్‌ఎక్స్ మీడియా సంస్థ నుంచి చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరానికి పది లక్షల రూపాయలు దక్కినట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో కార్తీని సీబీఐ పోలీసులు అరెస్టు చేశారు. కాగా చిదంబరాన్ని అరెస్టు చేయవద్దంటూ బుధవారమే ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే విచారణకు సహకరించాలని న్యాయస్థానం సూచించింది. జూన్ 3 వరకూ చిదంబరాన్ని అరెస్టు చేయవద్దంటూ హైకోర్టు తాత్కాలిక ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.