క్రైమ్/లీగల్

ఇద్దరు పిల్లలు సహా తల్లి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పొన్నూరు, జూన్ 1: సహజీవనం సాగిస్తున్న వ్యక్తి మోసగించి, మరో పెళ్లి చేసుకోవటంతో మనస్థాపానికి గురైన ఒక మహిళ ఇద్దరు పిల్లలు సహా ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద సంఘటన గంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలో గురువారం అర్ధరాత్రి జరిగింది. పొన్నూరు మండలం, జూపూడి గ్రామానికి చెందిన బొనిగల శారదకు అదే గ్రామానికి చెందిన ఉదయ్‌కుమార్‌తో 12 ఏళ్ల కిందట వివాహం జరిగింది. ఆ దంపతులకు కుమార్తె శ్రేష్ఠ(11), కుమారుడు ప్రకాష్‌వర్మ(7) సంతానం కలిగాక ఆమె భర్త ఉదయ్‌కుమార్ ఆరేళ్ల క్రితం మృతిచెందాడు. భర్త మృతితో సంక్రమించిన లక్షల నగదు, బంగారు నగలను పొందిన శారద తన ఇద్దరు పిల్లలను చదివించుకుంటూ తాను కూడా పొన్నూరులోని ఓ ప్రైవేటు స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తూ జూపూడిలోనే జీవనం సాగిస్తుండగా, శారదకు ఆ గ్రామంలోని రేషన్‌డీలర్ బొడ్డు కోటేశ్వరరావుతో పరిచయం ఏర్పడింది. శారద, ఆమె పిల్లలను ప్రేమగా చూసుకుంటానని నమ్మబలికిన కోటేశ్వరరావు ఆమెను ఒప్పించి సహజీవనం సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో శారద ఏడాది క్రితమే జూపూడి నుండి పొన్నూరు పట్టణానికి కాపురం మార్చింది. సహజీవనం సాగిస్తానని భరోసా ఇచ్చిన కోటేశ్వరరావుకు శారద భారీగానే నగదు, బంగారు నగలను కూడా అప్పగించినట్లు భోగట్టా. ఈ నేపథ్యంలో కోటేశ్వరరావు గురువారం యాజలిలోని ఓ అమ్మాయిని వివాహమాడినట్లు శారదకు తెలిసింది. తనను నమ్మించి మోసం చేశాడని మనస్థాపం చెందిన శారద తనపైనా, ఇద్దరు పిల్లలపైనా పెట్రోల్ పోసి నిప్పంటించుకుంది. శారదతో పాటు ఇద్దరు పిల్లల శరీరాలు కూడా కాలిబూడిదయ్యాయ. మృతదేహాలను శుక్రవారం నిడుబ్రోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఈ విషయం తెలుసుకుని పొన్నూరుకు చేరుకున్న శారద తండ్రి పులిపాటి బాబురావు, తల్లి యల్లమ్మ, బందువర్గం కన్నీరుమున్నీరుగా విలపించారు. తన కుమార్తె, ఆమె పిల్లలను మోసగించిన కోటేశ్వరరావు, అతనికి సహకరించిన అతడి బాబాయి సుధాకర్, చిన్నమ్మ క్రాంతిలపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతురాలి తండ్రి బాబూరావు అర్బన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాపట్ల డిఎస్‌పి గంగాధర్ పర్యవేక్షణలో అర్బన్ సిఐ ఎం నాగేశ్వరరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఆత్మహత్యకు కారకుడైన డీలర్ కోటేశ్వరరావు అతని తండ్రి మాణిక్యరావులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.