క్రైమ్/లీగల్

హుండీ లెక్కింపులో చేతివాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాళహస్తి, జూన్ 1: శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం హుండీ లెక్కింపు కార్యక్రమంలో ఒక ఉద్యోగి చేతివాటాన్ని ప్రదర్శించాడు. శుక్రవారం ఈఓ భ్రమరాంబ ఆధ్వర్యంలో సిబ్బంది హుండీ కానుకలను లెక్కించారు. ఈ సందర్భంగా లెక్కింపులో పాల్గొన్న స్కిట్ ఇంజనీరింగ్ కాలేజి ల్యాబ్ అసిస్టెంట్ జగదీష్ రూ.6900 కట్టగా కట్టి జేబులో పెట్టుకోవడాన్ని దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది గుర్తించి ఈఓ భ్రమరాంబకు ఫిర్యాదు చేశారు. ఆమె సూచన ప్రకారం సిబ్బంది జగదీష్‌ను తనిఖీచేయగా రూ.6900 నగదు లభించింది. ఆ తరువాత అతడిని వన్ టౌన్ పోలీసులకు అప్పగించారు. దేవస్థానం ఏఈఓ శ్రీనివాసులు రెడ్డి ఈ సంఘటనపై పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదుచేశారు. పోలీసులు జగదీష్‌ను విచారణ చేస్తున్నారు.