క్రైమ్/లీగల్

మద్యం సేవించి వాహనాలు నడిపిన పలువురికి జైలు శిక్ష, జరిమానా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, జూన్ 7: ఒంగోలు నగరంలో మద్యం సేవించి వాహనాలు నడిపిన మొత్తం 73 మందిని ఒంగోలు ట్రాఫిక్ పోలీసు సిబ్బంది గుర్తించి వారిని గురువారం ఒంగోలులోని మొబైల్ మెజిస్ట్రేట్ కోర్టు జడ్జి సియం వాణిశ్రీ ముందు హాజరు పరచగా జడ్జి వాణిశ్రీ వారిలో పలువురికి జైలు శిక్ష , జరిమానా విధించారు. ఒంగోలు నగరంలో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ రోడ్డు ప్రమాదాలకు గురవుతున్న నేపథ్యంలో జిల్లా ఎస్‌పి బి సత్య ఏసుబాబు ఆదేశాల మేరకు ఒంగోలు ట్రాఫిక్ డీఎస్పీ కె వేణుగోపాల్ తోపాటు వారి సిబ్బంది ఒంగోలు నగరంలో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారి మీద ప్రతి రోజూ వివిధ సమయాలలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌లు చేసి కేసులు నమోదు చేశారు. ఈ కేసులలో పట్టుబడిన మొత్తం 73 మందిని గురువారం ఒంగోలు మొబైల్ కోర్టు మెజిస్ట్రేట్ అయిన వాణిశ్రీ ముందు ప్రవేశపెట్టడం జరిగింది. మెజిస్ట్రేట్ అయిన వాణిశ్రీ మద్యం సేవించిన మోతాదును బట్టి వారిలో 23 మందికి రెండు రోజులు మరో 23 మందికి 3 రోజులు , 12 మందికి 5 రోజులు, 5 మందికి 7 రోజులు జైలు శిక్ష విధించారు. అదే విధంగా వీరిలో మరో 10 మందికి 2వేల ఒక్క వంద ఒక్క రూపాయి జరిమానావిదించి ముద్దాయిలు అందరినీ ఒంగోలు జైలుకు తరలించమని ఆదేశించారు.
ఈ సందర్బంగా ఒంగోలు ట్రాఫిక పోలీసు స్టేషన్ డీఎస్పీ కె వేణుగోపాల్ వారికి కౌన్సిలింగ్ ఇచ్చి మద్యం సేవించి వాహనాలు నడపడం వలన జరిగే ప్రమాదాల గురించి , వాటివలన జరిగే నష్టాల గురించి అందరికీ తెలియజేసి ముద్దాయిలందరిచేత ఇక మీదట మద్యం సేవించి వాహనాలు నడపము అని చెప్పిస్తూ అందరిచేత ప్రమాణం చేయించారు.