క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ (సర్పవరం జంక్షన్), జూన్ 8: కాకినాడ రూరల్ మండలం వాకలపూడి సూర్యామహల్ థియేటర్ సమీపంలో శుక్రవారం భార్యాభర్తలు ప్రయాణిస్తున్న మోటారు సైకిల్‌ను లారీ ఢీకొన్న ప్రమాదంలో అచ్చంపేట జంక్షన్‌కు చెందిన గుత్తుల వరలక్ష్మి (35) అక్కడికక్కడే మృతి చెందగా భర్త రామకృష్ణ తీవ్రంగా గాయపడ్డాడు. ఇరువురూ సాయంత్రం సమయంలో టివిఎస్ మోపెడ్‌పై బంధువుల ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు సర్పవరం పోలీసులకు సమాచారం అందించారు. ఇలావుండగా భార్యాభర్తల బంధువులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళన చేపట్టారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని లారీ యాజమాన్యాన్ని సంపర ఎఎంసీ ఛైర్మన్ కర్రి వెంకట్రాజు డిమాండ్ చేశారు. ఈలోగా సర్పవరం ఎస్‌ఐ సత్యనారాయణరెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చించారు. వరలక్ష్మి మృతదేహాన్ని పోస్టుమార్టమ్‌కు, రామకృష్ణను చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ సత్యనారాయణరెడ్డి తెలిపారు.