క్రైమ్/లీగల్

స్విమ్మింగ్ పూల్‌లో మునిగి బాలుడి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇల్లంతకుంట, జూన్ 8: అభం శుభం తెలియని వయస్సులో ఈత నేర్చుకోవాలనే కుతూహలంతో స్విమ్మింగ్ పూల్‌కు వెళ్లి స్విమ్మింగ్ పూల్‌లో మునిగి మృతి చెందిన బాలుని విషాధ సంఘటన మండల కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..మండల కేంద్రానికి చెందిన అంతటి శ్రీను-స్వరూపల కుమారుడు శివ (9) అనే బాలుడు ఈత నేర్చుకుందామని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సమీపంలో ఉన్న ఓ ప్రైవేటు స్విమ్మింగ్ పూల్‌కు వెళ్లాడు. స్విమ్మింగ్ పూల్‌లో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో స్విమ్మింగ్ ఫూల్‌లో ఎవరు లేకపోవడం వల్ల బాలుడు స్విమ్మింగ్ పూల్‌లోకి దూకగా ఈత రాకపోవడంతో మునిగి మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. మృతుడు 4వ తరగతి చదువుతున్నాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ చంద్రశేఖర్ పేర్కొన్నారు.