ఆంధ్రప్రదేశ్‌

పంటకు సిరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రూ.16,250.58 కోట్లతో వ్యవసాయ బడ్జెట్
రెండోదశ రుణ ఉపశమనానికి రూ.3512 కోట్లు
వ్యవసాయ విశ్వవిద్యాలయానికి రూ.139.92 కోట్లు రైతులకు ఉచిత విద్యుత్ సరఫరాకు రూ.3 వేల కోట్లు
వడ్డీలేని, పావలా వడ్డీ రుణాల రాయితీకి రూ.177 కోట్లు
అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన మంత్రి ప్రత్తిపాటి

హైదరాబాద్, మార్చి 10: ఆంధ్రప్రదేశ్‌లో సుస్ధిర వ్యవసాయాభివృద్ధిని సాధించేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నట్లు ఎపి వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. వ్యవసాయ, అనుబంధ రంగాల్లో ఉత్పాదకత పెంచి మారుతున్న పరిస్థితులను తట్టుకొని, రైతులకు లాభసాటిగా ఉండేవిధంగా తీర్చిదిద్దుతున్నట్లు వెల్లడించారు. 2016-17 సంవత్సరానికి గాను రూ.16250.58 కోట్లతోవ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు శాసనసభలో గురువారం ప్రవేశపెట్టారు. శాసనమండలిలో వ్యవసాయ బడ్జెట్‌ను వ్యవసాయ మంత్రి తరఫున కార్మిక శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టారు. సమగ్ర వ్యవసాయ అభివృద్ధికిగాను రైతు సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్ద పీట వేసినట్లు తమ బడ్జెట్ ప్రసంగంలో మంత్రులు పేర్కొన్నారు. రైతు రుణమాఫీ వాగ్దానానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెబుతూ ఇప్పటి వరకు రూ.7,433 కోట్ల మొత్తాన్ని విడుదల చేసి 35.15 లక్షల మంది రైతు కుటుంబాలకు చెందిన 54.06 లక్షల ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. మిగిలిన రుణ ఉపశమన అర్హత ఉన్న మొత్తానికి 4 వార్షిక వాయిదాలల్లో 10 శాతం వడ్డీతో సహా ప్రభుత్వమే చెల్లిస్తుందని మంత్రి తెలిపారు. ఉద్యాన పంటలకు కూడా ఎకరానికి రూ.10 వేల వరకు గరిష్టంగా రూ.50 వేల వరకు ఒక కుటుంబానికి 5 ఎకరాలకు మించకుండా రుణమాఫీ వర్తింప చేసేందుకు హామీ ఇచ్చామని తెలిపారు. దీనిలో భాగంగా రుణ ఉపశమన రెండవ దశ చెల్లింపుల కోసం రూ.3512 కోట్లు మొత్తాన్ని కేటాయించినట్లు మంత్రి పుల్లారావు వెల్లడించారు. దీనిలోనే ఉద్యానశాఖకు 2015-16కి గాను రూ.550 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. కాగా వ్యవసాయ, దాని అనుబంధ రంగాలకు ప్రణాళిక వ్యయం కింద రూ.7691.90 కోట్లు, ప్రణాళికేతర వ్యయం కింద రూ.8558.68 కోట్లు బడ్జెట్‌ను ప్రతిపాదించారు. వ్యవసాయ క్షేత్ర యాంత్రీకరణ కోసం రూ.161.25 కోట్లు, పొలం పిలుస్తోంది, చంద్రన్న రైతు క్షేత్రాల ప్రదర్శనలకు రూ.15.50 కోట్లను కేటాయించారు. పంటల బీమా పథకం కోసం రూ.344 కోట్లను కేటాయించినట్లు మంత్రి వెల్లడించారు. రైతులకు ఉచిత విద్యుత్ సరఫరాకు రూ.3 వేల కోట్లతో ప్రతిపాదించారు. వ్యవసాయ విశ్వవిద్యాలయానికి రూ.139.92 కోట్లు ప్రణాళికేతర కింద, రూ.40 కోట్లు ప్రణాళిక కింద ప్రతిపాదించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రైతాంగానికి అభివృద్ధి ఫలాలను అందిస్తూ వ్యవసాయ దాని అనుబంధ రంగాల సమగ్ర ప్రయత్నాల ద్వారా ‘ప్రాధమిక రంగ మిషన్’లో భాగంగా అధిక వృద్ధి రేటు సాధించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. పశు సంవర్ధక శాఖకు రూ.819.35 కోట్లు, ఎస్సీ, ఎస్టీ కుటుంబాల పశు సంపదను మెరుగుపర్చేందుకు వివిధ పశువుల అభివృద్ధి పథకాల అమల్లో భాగంగా ఎస్సీ ఉప ప్రణాళిక కింద రూ.59.59 కోట్లు, ఎస్టీ ఉప ప్రణాళిక కింద రూ.20.86 కోట్లు ఉపయోగించాలని ప్రతిపాదించామని మంత్రి పత్తిపాటి పుల్లారావు తన ప్రసంగంలో వెల్లడించారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో 26.40 లక్షల టన్నుల చేపలు ఉత్పత్తి లక్ష్యంగా చేసుకున్నట్లు వెల్లడించారు. శ్రీవేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయానికి అనుసంధానంగా విజయనగరం జిల్లా గరివిడిలో కొత్తగా పశువైద్య కళాశాల, కర్నూలు జిల్లా బనవాసి వద్ద పశుసంవర్ధక పాలిటెక్నిక్ కళాశాలను ప్రారంభిస్తామని మంత్రి స్పష్టం చేశారు. వ్యవసాయ కోర్సుల పట్ల పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని 2016-17 విద్యా సంవత్సరానికి అన్ని వ్యవసాయ డిగ్రీ కోర్సుల్లో 25 శాతం సీట్లను పెంచినట్లు తెలిపారు. సమీకృత ఉద్యాన అభివృద్ధి మిషన్ పథకం ద్వారా ఉద్యాన పంటల సమగ్ర అభివృద్ధికి రూ.95.33 కోట్లు, ప్రధానమంత్రి కృషి శించాయి పథకం (పిఎంకెఎస్‌వై) ద్వారా బిందు, తుంపర్ల సేద్యం అమలుకు రూ.369.58 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. పట్టుపరిశ్రమ అభివృద్ధికి ప్రణాళిక బడ్జెట్ కింద రూ.26.60 కోట్లు, ప్రణాళికేతర బడ్జెట్ కింద రూ.121.56 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. జిల్లాకొక పశు వసతి గృహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు పిపిపి పద్దతిలో 792 గ్రామాలకు పశువైద్య సేవలను అందుబాటులోకి తెచ్చే ఆలోచనతో ఎన్‌టిఆర్ సంచార పశువైద్య సేవల పథకాన్ని ప్రతిపాదించామని వెల్లడించారు. ఉత్పత్తి వ్యవయాన్ని తగ్గించేందుకు గాను ఐదు లక్షల రైతులకు రేషన్ బ్యాలెన్సింగ్ ప్రోగ్రామ్‌ను పరిచయం చేయనున్నట్లు తెలిపారు. మార్కెట్ యార్డుల్లో ఈ-మార్కెటింగ్‌ను ప్రవేశపెట్టి నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్‌నకు అనుసంధానించాలని కేంద్రప్రభుత్వానికి ప్రతిపాదించినట్లు స్పష్టం చేశారు. చిరుధాన్యాల ఉత్పత్తి, వినియోగాన్ని పునరుద్దరించడానికి 7 జిల్లాల్లోని 47 మండలాల్లోని గిరిజన, వర్షాధార ప్రాంతాల్లో సమగ్ర చిరుధాన్యాల పునరుద్దరణ పథకాన్ని ప్రారంభించామని తెలిపారు. (చిత్రం) అసెంబ్లీలో గురువారం వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న మంత్రి ప్రత్తిపాటి