తెలంగాణ

బ్రెజిల్ కరెన్సీతో అయిదుగురు అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: బ్రెజిల్‌లో రద్దు చేసిన పాత కరెన్సీని భారతీయ కరెన్సీలోకి మార్పిడి చేసేందుకు యత్నించిన అయిదుగురిని నగరంలో పోలీసులు అరెస్టు చేశారు. రామగుండకు చెందిన 36 ఏళ్ల మహేష్ నగరంలోని బోయిన్‌పల్లిలో ఉంటూ భానుచందర్, భవానీ ప్రవీణ్, యాదగిరిరెడ్డి, రాధాకృష్ణ అనే యువకులతో పరిచయాలు పెంచుకున్నాడు. బ్రెజిల్‌లో 1986-89 కాలంలో చెలామణిలో ఉన్న కరెన్సీని వీరు ముంబయిలో 36 వేలకు తీసుకున్నారు. పాత కరెన్సీని అమీర్‌పేట బిగ్‌బజార్ వద్ద వీరు 36 లక్షల రూపాయలకు విక్రయించేందుకు సిద్ధం కాగా పోలీసులు దాడి చేశారు. 1.17 కోట్ల రూపాయల విలువైన పాత కరెన్సీని స్వాధీనం చేసుకుని అయిదుగురిని అరెస్టు చేశారు. ఈ ముఠాకి సంబంధించి కీలక నిందితుడు పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.