రాష్ట్రీయం

దత్తన్న చేసిన తప్పేంటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 23: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ (హెచ్‌సియు) విద్యార్థి రోహిత్ ఆత్మహత్య ఘటనలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయపై నమోదు చేసిన కేసును ఉపసంహరించుకోవాలని పలు బిసి, దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. విద్యార్థి ఆత్మహత్యకు దత్తాత్రేయకు ఎలాంటి సంబంధం లేదని ఆ సంఘాలు పేర్కొన్నాయి. బిసి వర్గానికి చెందిన దత్తాత్రేయను మంత్రి పదవి నుంచి తొలగించే కుట్ర జరుగుతోందని ఆ సంఘాలు ఆరోపించాయి. బిసి సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో నగరంలోని ఒక హోటల్‌లో శనివారం నిర్వహించిన బిసి సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు వక్తలు ప్రసంగించారు. సమావేశం ప్రారంభానికి ముందు విద్యార్థి రోహిత్ మృతికి సంతాపంగా రెండు నిమిషాలు వౌనం పాటించారు. బిజెపి బిసి మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు వి.శ్రీరాములు, బిజెపి దళిత మోర్చా అధ్యక్షుడు చింతా సాంబశివరావు, ఆదివాసీ సంఘం అధ్యక్షుడు అమర్‌సింగ్, తెలంగాణ దళిత సంఘం అధ్యక్షుడు ప్రొఫెసర్ జయరాం, తెలక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దాసరి మల్లేశం, బిసి యునైటెడ్ ఫ్రంట్ నేత రామకృష్ణయ్య, బిసి మోర్చా నాయకురాలు సంధ్యారాణి తదితరులు రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రసంగించారు.యూనివర్శిటీలో ఉగ్రవాది యాకుబ్ మెమన్ ఉరితీతకు వ్యతిరేకంగా ప్రదర్శన నిర్వహించడం అంటే ఉగ్రవాదులకు వత్తాసు పలకడమే అవుతుందని అన్నారు.
ఈ సంఘటనపై ఎబివిపి విద్యార్థి నేతలు దత్తాత్రేయను కలిసి వినతిపత్రం ఇచ్చి చర్యలు తీసుకోవాలని కోరితే ఆయన మామూలుగానే విసికి ఆ లేఖను ఇచ్చి చర్య తీసుకోవాలని చెప్పారని అన్నారు. ఇంతకు మినహా దత్తాత్రేయ చేసింది ఏమీ లేదని అన్నారు. కేవలం రాజకీయంగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రి దత్తాత్రేయలను ఎదుర్కోలేక కుట్రతోనే ఇలా రాజకీయం చేస్తున్నారని వారు ఆరోపించారు. పఠాన్‌కోట్‌లో జరిగిన ఉగ్రదాడిలో ఏడుగురు భద్రతా దళ సిబ్బంది చనిపోతే వారి కుటుంబాలను పరామర్శించే తీరిక లేని సీతారాం ఏచూరి, కేజ్రీవాల్ వంటి నేతలు మొదలుకుని గల్లీ నాయకుల వరకు హెచ్‌సియు ఘటనకు కులం రంగు పులిమి రాజకీయం చేస్తూ పబ్బం గడుపుకోవాలనుకోవడం సిగ్గుచేటని అన్నారు. హెచ్‌సియులో స్వామి వివేకానంద జయంతిని నిర్వహిస్తే దానిపై ఫేస్‌బుక్‌లో విద్యార్థి రోహిత్ చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరమని అన్నారు. ఉగ్రవాది యాకుబ్ మెమన్‌కు అనుకూలంగా నినాదాలు చేయడం మరింత సిగ్గుచేటని అన్నారు. ఇప్పుడు హెచ్‌సియుకు తరలి వస్తున్న వారంతా ఉగ్రవాదులను సమర్ధిస్తున్నట్లే భావించాలని అన్నారు.