తెలంగాణ

గథ్దర్, మంద, కృష్ణయ్య కొత్త పార్టీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 13: ఇక ఎండా కాలంతో పాటు సార్వత్రిక ఎన్నికల వేడి పెరుగుతోంది. పొత్తులు, ఫ్రంట్‌లు, కలయికలు, కొత్త పార్టీలు, ఫిరాయింపులు ఊపందుకుంటున్నాయి. తాజాగా బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, ప్రజా గాయకుడు గద్దర్, ఎంఆర్‌పిఎస్ జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ కలిసి ఓ పార్టీ స్థాపించాలన్న ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ గాబరా పడింది. ఎందుకంటే కృష్ణయ్యతో బిసిల ఓట్లు, మంద కృష్ణతో దళితుల ఓట్లు దూరం అవుతాయన్న భయం. ఎఐసిసి ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ ఆర్‌సి కుంతియా నేరుగా ఆర్. కృష్ణయ్య నివాసానికి చేరుకుని మంతనాలు జరిపారు. కొత్త పార్టీ పెడితే ఓట్లు చీలిపోయి, మళ్లీ టిఆర్‌ఎస్‌కే మేలు చేకూరుతుంది కాబట్టి అటువంటి ఆలోచన ఏదీ చేయరాదని కోరారు. అంతేకాదు తమ పార్టీలోకి వచ్చినట్లయితే గౌరవప్రదమైన స్థానాన్నీ కల్పిస్తామన్నారు. ఇదే విషయాన్ని మంద కృష్ణకూ చెప్పాల్సిందిగా కుంతియా కృష్ణయ్యను కోరినట్లు సమాచారం. తాను ఇప్పుడే ఏమీ చెప్పలేనని, గద్దర్, మంద కృష్ణతో మాట్లాడిన తర్వాతే తుది అభిప్రాయాన్ని వెల్లడించగలనని కృష్ణయ్య ఆయనకు చెప్పినట్లు తెలుస్తోంది. ఇలాఉండగా కుంతియా దౌత్యంపై కృష్ణయ్య, మంద కృష్ణ, గద్దర్‌లు చర్చించారు. ఇది కాంగ్రెస్ స్వలాభం కోసమే చేస్తున్న ఎత్తుగడగా వారు భావించారు. పార్టీ స్థాపించాలని, అవసరమైతే పొత్తు పెట్టుకోవాలే తప్ప తొందరపడి కాంగ్రెస్ 3తీపి2 మాటల్లో పడరాదని నిర్ణయించినట్లు తెలిసింది. కృష్ణయ్యను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి, ముందుకు సాగాలని గద్దర్, మంద కృష్ణ మాదిగ భావిస్తున్నట్లు సమాచారం.
బిసిల సమస్యలపై సంవత్సరాల తరబడి పోరాటాలు చేస్తూ బిసి నేతగా గుర్తింపు పొందిన కృష్ణయ్య పార్టీ పెడితే ఎలా?, దళితులను ఆకర్షించి దళిత నేతగా గుర్తింపు పొందిన మంద కృష్ణ, ప్రజా గాయకుడు గద్దర్ కృష్ణయ్యతో కలిస్తే ఎలా? అని కాంగ్రెస్‌లో తర్జన-్భర్జన జరుగుతున్నది. మరోవైపు టి.జెఎసి చైర్మన్ ఫ్రొపెసర్ ఎం. కోదండరామ్, సిపిఐతో కలిసి సకల జనుల ఫ్రంట్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. అదే జరిగితే తామే చొరవ తీసుకుని సకల జనుల మహా ఫ్రంట్‌కు శ్రీకారం చుట్టి కృష్ణయ్య, కోదండరామ్, గద్దర్, మంద కృష్ణతో పాటు సిపిఐని, ఆ పార్టీతో కలిసి వచ్చే పార్టీలనూ కలుపుకుని పోతే బాగుంటుందని కాంగ్రెస్ నేతల ఆకాంక్ష.
కాగా సిపిఎం మరో అడుగు ముందుకేసి దళిత సంఘాలను కలుపుకుని బహుజనుల ఫ్రంట్ ఏర్పాటు చేయడానికి తీవ్రంగా కృషి చేస్తున్నది. జస్టిస్ చంద్ర కుమార్ నేతృత్వంలోనూ ఓ పార్టీ రాబోతున్నట్లు ప్రచారం జరుగుతున్నది. డాక్టర్ చెరుకు సుధాకర్ ఇదివరకే తెలంగాణ ఇంటి పార్టీని స్థాపించి టిఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఇన్ని పార్టీలు, ఫ్రంట్‌లూ పుట్టుకుని వస్తే కేసీఆర్‌కే లాభం అనే అంఛనా, అనుమానాన్ని మరి కొంత మంది వ్యక్తం చేస్తున్నారు.