అక్షర

దేశం అభివృద్ధి సాధించాలంటే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తమ కుటుంబం
-ఉదాత్త దేశం
రచన: ఆచార్య మహాప్రజ్ఞ, ఎపిజె అబ్దుల్ కలాం
అనువాదం: వాడ్రేవు
చినవీరభద్రుడు
వెల: రు.250/-
పుటలు: 214
ప్రతులకు: జ్యోతి బుక్ డిపో, డాబా గార్డెన్స్, విశాఖపట్నం

ఇంగ్లీషులో ఈ పుస్తకం పేరు ‘కుటుంబం-దేశం’ అని మాత్రమే. తెలుగులోకి వచ్చేసరికి ఆ రెండు మాటలకు విశేషణాలు తోడయినాయి. రచయిత ఒకరు జైన ఆచార్యులు. కలాం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ ఇద్దరు కలిసి జాతీయాభివృద్ధి గురించి పుస్తకం రాయవలసిన అవసరం, మొత్తం పుస్తకం చదివిన తర్వాత కూడా అర్థం కాదు. నిజానికి పుస్తకంలో కలాం పాత్ర తక్కువ!
దేశం అభివృద్ధి సాధించాలంటే, సైనిక బలం ఆర్థిక బలం లాంటివి చాలవన్నది ఈ రచనకు మూల సూత్రం. ప్రజల్లో నైతికత పెరగాలి. అందుకని కుటుంబ వ్యవస్థ మరింత పటిష్టం కావాలి. ఈ వాదాన్ని జైనముని తమదైన తీరులో చెప్పి అక్కడక్కడ కలాంని కూడా కలిపారు. పుస్తకం చదవడం, ఆకస్తిగలవారికే కొంత కష్టం. పాశ్చాత్య తాత్వికుల భావనలు, జైనంలోని విషయాలు మరేవో అందని ఆలోచనలు కలిపి ఒకటికి రెండుసార్లు చదివితేగానీ సంగతి బోధపడని తీరులో రచన సాగింది. కలాంగారున్నారు కనుక, భారతీయ విజ్ఞాన శాస్త్రం గురించి అనివార్యంగా చెప్పడం, తికమకను మరింత ముందుకు తోస్తుంది. రచయితలిద్దరి ఆలోచనల్లో, అభివ్యక్తిలో తేడా వద్దన్నా ఎదుట నిలబడుతుంది!
తత్వచర్య లోతుగా సాగుతుంది. అవీ, అందరికీ తెలియని జైన మార్గంలో సాగుతుంది. మామూలు పాఠకులకు సందేశం అందకుండా ఉండే అవకాశం ఈ రకంగా నిండా ఉందనిపిస్తుంది. మత సామరస్యం గురించి రాశారు. అయితే ఎక్కడా హిందు మెజారిటీ గురించి, సవ్యంగా గాని మరోరకంగా గాని అనకుండానే అంశాన్ని ముగించారు. సూఫీయిజం ప్రసక్తి కూడా చేసారిక్కడ.
ఈ పుస్తకం అనువాదకుడిని బాగా శ్రమకు గురిచేసిందన్న సంగతి అడుగడుగునా అర్ధమవుతుంది. జైన గురువు, కలాంగారిని, ‘నీవు‘ అంటూ సంబోధించినట్టు రాశారు. ఆంగ్ల మూలంలో ఈ తేడా ఎట్లా తెలిసింది? ‘అగాధ నిశ్శబ్దంలో మనసు ఎల్లలు లేని సర్వ వ్యాపక, ఏకీకృత సీమతో మమేకమై ఆ క్షేత్రాన్ని సమస్త అస్తిత్వానికీ, అంతర్లీనంగా ప్రవహిస్తున్న ఒక నిరంతర స్రవంతి..’ ఇది తెలుగేనా? ఇంతకూ ఏం చెప్పాలని ఈ తపన? ఇటువంటి ఉదాహరణలు ఎన్నో? నైసర్పం, అజీవులు, సంఘపళవులు లాంటి మాటలు ఒక్క క్షణం ఆగమంటాయి.
కుటుంబ వ్యవస్థ బలంగా, ఆనందమయంగా ఉండాలనే సందేశం దేశానికి అందించాలని ఈ రచన చేసినట్టు సులభంగానే చెప్పవచ్చు. ఆ మంచి మాట చెప్పడానికి, మరింత అవగాహ్యము, అనుసరణీయము అయిన రచనకు అవకాశం లేదా? ఓపికగా పుస్తకం చదివినా ఏమిటిది అన్న ప్రశ్న మిగులుతుందన్నది అనుమానం లేని అంశం.
కలాంకు వదిలిపెడితే పరిశోధకుడిగా, దేశాధ్యక్షుడుగా అనుభవాలను చాలా బాగా చెప్పి ఉండేవారు! ఈ గోలంతా లేకుండానే!

-గోపాలం కె.బి