బిజినెస్

దోశ ధర ఎందుకు తగ్గట్లేదు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొచ్చి, ఫిబ్రవరి 14: దోశ ధర అధికంగా ఉండటానికి, ఆ దోశ వేసే విధానంలో మార్పు రాకపోవడమే కారణమన్నారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్ రఘురామ్ రాజన్. రాజనేంటి? దోశ ధరేంటి అనుకుంటున్నారా?. శనివారం దేశీయ ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్ సంస్థ ఫెడరల్ బ్యాంక్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాజన్‌కు, ఓ ఇంజినీరింగ్ విద్యార్థినికి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ద్రవ్యోల్బణాన్ని ఆర్‌బిఐ అదుపులోకి తెచ్చిందని రాజన్ అన్నప్పుడు, మరి దోశ ధర ఇంకా ఎందుకు తగ్గలేదని ఓ విద్యార్థిని సరదాగా ప్రశ్నించింది. దీంతో గతంతో పోల్చితే పారిశ్రామిక, బ్యాంకింగ్, వ్యాపార తదితర రంగాలన్నింటిలో సాంకేతిక పరిజ్ఞానం పెరిగిపోయిందని, అందుకే వాటి సేవలు చౌకగా అందుకోగలుగుతున్నామని, అయితే ఇప్పటికే దోశ వేసే విధానంలో మార్పు రాలేదని, నాటి నుంచి నేటి వరకు అదే పెనంపై వేస్తున్నారంటూ తప్పంతా పెనంపై నెట్టేశారు. ఇది మారినప్పుడు దోశ ధర దానంతటదే తగ్గుతుందని ఆ విద్యార్థినికి మరింత సరదాగా సమాధానమిచ్చారు ఆర్‌బిఐ గవర్నర్.