కరీంనగర్

‘డయల్ యువర్ కలెక్టర్’, ప్రజావాణి రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముకరంపుర (కరీంనగర్), జనవరి 22: ప్రతీ సోమవారం నిర్వహించే ‘డయల్ యువర్ కలెక్టర్’, ప్రజావాణి కార్యక్రమాలు జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఈ సోమవారం (25.1.2016)న రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. వచ్చే సోమవారం యదావిధిగా డయల్ యువర్ కలెక్టర్, ప్రజావాణి కార్యక్రమాలు ఉంటాయని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని ఆమె కోరారు.

చిరుత దాడిలో యువకుడి మృతి
మహాదేవపూర్, జనవరి 22: మహారాష్టల్రోని పూణే జిల్లా ఖాన్‌పురా అటవీ ప్రాంతంలో చిరుత పులి యువకుడిపై దాడి చేసింది. కాళేశ్వరానికి సుమారు వంద కిలో మీటర్లకు పైగా దూరంలో గల ఖాన్‌పురా అడవుల్లో గత మూడు రోజుల క్రితం చిరుత పులి సంచరించినట్లు అక్కడి స్థానికులు ధృవీకరించారు. కాగా ఖాన్‌పురాకు సమీపంలోని అడవి ప్రాంతంలో యువకుడిపై చిరుత దాడి చేయడంతో కడుపులోని పేగులను చిరుత పీక్కొని తిన్నదని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా కరీంనగర్ జిల్లా సరిహాద్దుల్లోనే చిరుత సంచారం, దాడి చేసి యువకుడిని బలి గొందని పుకార్లు ప్రచారం చేశాయి. కాగా జిల్లా పరిధిలో చిరుత సంచారం లేదని, ఏలాంటి దాడులు జరగలేదని అటవీ శాఖాధికారి లక్ష్మయ్య, పోలీసు ఎస్‌ఐ కృష్ణారెడ్డి తెలిపారు.

పురాకృత సుకృతం యాగ సందర్శనం
* ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్
ధర్మపురి, జనవరి 22: సనాతన సాంప్రదాయాల సిరియైన గోదావరీ తీరస్థ ధర్మపురి క్షేత్రంలో నిర్వహిస్తున్న సోమయాగ సందర్శ భాగ్యం తమ పురాకృత సుకృత ఫలితమేని ధర్మపురి శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్ ఉద్ఘాటించారు. శుక్రవారం ధర్మపురి క్షేత్రానికి అరుదెంచిన ఆయన అధికారులు, ప్రజాప్రతినిధులు, టిఆర్‌ఎస్ నేతలు తోడురాగా సతి స్నేహలత సమేతంగా సోమయాగాన్ని సందర్శించారు. వేద పండితులు, రుత్విక్కులు, ప్రధానంగా శృంగేరీ సంస్థాన పౌరాణికులు బాచంపెల్లి సంతోష్ శాస్ర్తీ తెలంగాణ ఏర్పడినాక నిర్వహిస్తున్న తొలి సోమయాగం జ్యోతిరప్తోర్యామం మహాగ్ని చయన పూర్వక సోమయాగ విశిష్టతను ఈశ్వర్‌కు వివరించారు. ఈ సందర్భంగా చీఫ్‌విప్ ఈశ్వర్ మాట్లాడుతూ, భారతీయ ప్రాచీన సంస్కతి సభ్యతలకు, సనాతన సాంప్రదాయాలకు, వేదవేదాంగ శాస్త్రాగమ సకల కళలకు, వైదిక కర్మలకు నిలయమైన ధార్మిక క్షేత్రంలో అపురూప సోమయాగాన్ని హైదరాబాద్‌కు చెందిన శ్రౌత సంవర్ధినీ సభ నిర్వహించడం నిత్యాగ్న హోత్ర తత్పరులైన బ్రహ్మశ్రీ మాడుగల మాణిక్య సోమయాజి, లలితా సోమిదేవి దంపతులు యజమానులుగా వ్యవహరించడం, వివిధ రాష్టమ్రులకు చెందిన నిష్ణాతులైన, అనుభవైకవేద్యులైన యాగ నిర్వాహకులు పాల్గొనడం క్షేత్ర పవిత్రతను ఇనుమడింప చేస్తున్నదన్నారు. సోమయాగ ఫలితంగా ప్రకృతి కరుణించి కరవు లేకుండా చేయగలదని పరిపూర్ణ విశ్వాసాన్ని ఆయన ప్రకటించారు. ధర్మపురి ఎంపిపి కొండపెల్లి మమత, వైస్ ఎంపిపి అయ్యోరి రాజేశ్ కుమార్, పిఎసిఎస్ చైర్మన్ రాజేందర్, స్థానిక సర్పంచ్ సంగి సత్తమ్మ, తహశీల్‌దార్ మహేశ్వర్, ఎంపిడిఓ శశికళ, సిఐ వెంకట రమణ, టిఆర్‌ఎస్ నేతలు లింగన్న, శంకర్, శ్రీనివాస్ తదితరులు ఈశ్వర్ వెంట ఉన్నారు.