బిజినెస్

మిశ్రమంగా ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 16: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం మిశ్రమంగా ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ నష్టాలను అందుకోగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ లాభాలను పొందింది. సెనె్సక్స్ 19.33 పాయింట్లు కోల్పోయి 31,056.40 వద్ద నిలవగా, నిఫ్టీ 10 పాయింట్లు పెరిగి 9,588.05 వద్ద నిలిచింది. ఇదిలావుంటే ఈ వారం మొత్తంగా సెనె్సక్స్ 205.66 పాయింట్లు, నిఫ్టీ 80.20 పాయింట్లు కోల్పోయాయి. అంతకుముందు వారం కూడా సూచీలు నష్టాల్లోనే ముగిశాయి. కాగా, శుక్రవారం ట్రేడింగ్‌లో ముఖ్యంగా ఎఫ్‌ఎమ్‌సిజి, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ షేర్లు లాభపడితే, హెల్త్‌కేర్ షేర్లు నష్టపోయాయి.