తెలంగాణ

టెండర్ల దిశగా డిండి పరుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ: నల్లగొండ జిల్లా డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించే ఐదు రిజర్వాయర్ల నిర్మాణానికి ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ 3102కోట్లతో ప్రతిపాదనలు ఇవ్వడంతో ప్రభుత్వం రేపోమాపో టెండర్ల ప్రక్రియకు సిద్ధమవుతోంది. ఇప్పటికే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోథల పథకానికి 18ప్యాకేజీలుగా 29,928కోట్ల పనులకు టెండర్లను పిలిచిన ప్రభుత్వం తదుపరి డిండి ఎత్తిపోతల టెండర్ల ప్రక్రియ దిశగా అడుగులేస్తోంది. 6,190కోట్లతో అంచనా వ్యయంతో 3.50లక్షల ఎకరాలకు సాగునీరు, జిల్లా ప్రజలకు తాగునీరందించే లక్ష్యంతో నిర్మించ తలపెట్టిన డిండి ఎత్తిపోతల పథకానికి గత ఏడాది జూన్ 12న శివన్నగూడెంలో సిఎం కెసిఆర్ శంకుస్థాపన చేశారు. రెండున్నరేళ్లలోగా ఈ పథకం పనులు పూర్తి చేసి కరవు, ఫ్లోరైడ్ పీడిత నల్లగొండ జిల్లావాసులకు కృష్ణా జలాలను అందిస్తామని ప్రకటించారు. ఈ దిశగా డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా ఇప్పటికే సింగరాజుపల్లి, కిష్టరాయినపల్లి, శివన్నగూడెం, చింతపల్లి, గొట్టముక్కల రిజర్వాయర్లన నిర్మాణాలకు టెండర్ల పిలిచేందుకు 3,100కోట్లతో ప్రతిపాదలు సమర్పించారు. ఇప్పటికే రిజర్వాయర్ల నిర్మాణాలకు 7,515ఎకరాల భూసేకరణకుగాను 5380ఎకరాల భూసేకరణ పూర్తి చేశారు.
అయితే మహాబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు పాలమూరు-రంగారెడ్డితో సంబంధం లేకుండా డిండి ఎత్తిపోతల పథకాన్ని వేరుగా చేపట్టాలన్న డిమాండ్ తెరపైకి తీసుకు రావడం డిండి ఎత్తిపోతల టెండర్ల ప్రక్రియకు ఆటంకంగా కనిపిస్తుంది. డిండి ఎత్తిపోతల డిజైన్ మార్పుతో ముందుగా నిర్ధేశించిన నల్లగొండ జిల్లా ఆయకట్టుతో పాటు కొత్తగా రంగారెడ్డి జిల్లాలో కొంత ఆయకట్టుకు, రాచకొండ ప్రాంతంలో రిజర్వాయర్‌కు నీరందించాల్సి వుంది. ఇందుకు మహాబూబ్‌నగర్ జిల్లాలోని పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పరిధిలోని ఏదులా రిజర్వాయర్ నుండి రోజుకు ఒక టిఎంసి చొప్పున 60రోజుల పాటు నీటిని డిండి రిజర్వాయర్‌కు మళ్లిస్తారు. అయితే పాలమూరు ఎత్తిపోతల పరిధిలోని 10లక్షల ఎకరాలకే రోజుకు రెండు టిఎంసిలు కావాలని అలాంటప్పుడు డిండి ఎత్తిపోతలకు ఏదులా రిజర్వాయర్ నుండి నీటిని తరలిస్తే తమ జిల్లాలోని ఆయకట్టుకు సాగునీటి కొరత ఎదురవుతుందని ఆ జిల్లా ప్రతినిధులు తాజాగా అభ్యంతరాలు లేపారు. అలాగే కల్వకుర్తి కాలువ ఆయకట్టుకు కూడా గండి పడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఏదులా నుండి నీటి తరలింపుపై ఆలైన్‌మెంట్ ఖారారు కాకుండానే డిండి ఎత్తిపోతల రిజర్వాయర్లకు టెండర్లు పిలువడాన్ని మహాబూబ్‌నగర్ జిల్లా ప్రతిపక్ష ప్రజాప్రతినిధులు అభ్యంతర పెడుతున్నారు. దీంతో డిండి ఎత్తిపోతల రిజర్వాయర్ల టెండర్లు పిలువడం వెంటనే జరుగుతుందా లేక మరికొంత కాలం ఆలస్యానికి దారితీస్తుందా అన్న సందేహాలు వినిపిస్తున్నాయి. ఈ సమస్యపై సిఎం కెసిఆర్, మంత్రి టి.హారీష్‌రావు ఈ ఏ విధంగా స్పందిస్తారన్నదానిపై డిండి ఎత్తిపోతల టెండర్ల ఖరారు ఆధారపడి ఉంది. మరోవైపు పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాల నిర్మాణాల పట్ల ఏపి సిఎం చంద్రబాబు, వైకాపా అధ్యక్షుడు వైఎస్.జగన్‌లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తు కేంద్రానికి, గవర్నర్‌లకు ఫిర్యాదు చేసిన పరిణామాలు కూడా ఈ ఎత్తిపోతల పథకాల నిర్మాణ ప్రయత్నాలపై ప్రభావం చూపుతుండటం నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లావాసులకు ఆందోళనకరంగా చెప్పవచ్చు.