ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

సమష్టి కృషికి సమారాధన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమష్టిగా కృషి చేస్తే సత్ఫలితాలు ఉంటాయనేది మరోసారి రుజువైంది. ప్రపంచాన్ని గడగడలాడిస్తూ ఒక లక్షా పదిహేను వేలమందిని పొట్టన పెట్టుకున్న కరోనా వైరస్ మహమ్మారిని నిలువరించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమిష్టిగా చేస్తున్న కృషి ఇందుకు తాజా ఉదాహరణ. ప్రధాన మంత్రి, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు అనుక్షణం పరిస్థితిని సమీక్షిస్తూ లాక్ డౌన్ వంటి కఠిన నిర్ణయాలతో కరోనావైరస్‌ను అదుపు చేయటంలో గణనీయమైన విజయం సాధించారు. పార్టీ రాజకీయాలను పక్కన పెట్టి దేశం, ప్రజల పట్ల తమకున్న బాధ్యతకు పెద్ద పీట వేయటం ద్వారా కరోనా వైరస్ విస్తరణను అదుపు చేయగలుగుతున్నారు. ప్రపంచానికి నాయకత్వం వహిస్తున్న అగ్రదేశం అమెరికాలో ఇంతవరకు దాదాపు ఇరవై వేల మంది కరోనావైరస్ మూలంగా మరణించారు. మరో వారం పది రోజుల్లో అమెరికాలో మరణించే వారి సంఖ్య ముప్పై ఐదు వేలు దాటుతుందని అంచనా వేస్తున్నారు. కరోనా వైరస్ మహమ్మారి మూలంగా అమెరికాలో ఒక లక్ష నుండి రెండున్నర లక్షల మంది మృత్యువాత పడే ప్రమాదం ఉన్నదని అమెరికా ప్రభుత్వం అంచనా వేయటం చూస్తుంటే అక్కడ పరిస్థితి ఎంత భయంకరంగా ఉన్నదో ఊహించుకోవచ్చు. మహమ్మారి కరోనావైరస్ పుట్టిన చైనా దేశంలో కేవలం మూడు వేల నాలుగు వందల మంది మరణిస్తే అమెరికాలో దాదాపు ఇరవై వేలు, అభివృద్ధి చెందిన మరో దేశం ఇటలీలో పదహారు వేలు, స్పెయిన్‌లో పద్నాలుగు వేల మంది మరణించారు. చైనాలో మరణించిన వారి సంఖ్య 3, 400 దాటలేదంటే విశ్వసించటం కష్టమే. కరోనా వైరస్ మూలంగా మరణించినవారి సంఖ్య దాదాపు యాభై వేలని పలు వార్తలు వచ్చినా చైనా ప్రభుత్వం దీనిని తిరస్కరించింది. చైనాలో వాస్తవంగా ఎంత మంది మరణించారనేది ముందు ముందు గానీ వెలుగులోకి రాదు. అయితే చైనా ప్రభుత్వం కరోనావైరస్‌ను అదుపు చేయటంలో సాధించిన విజయాన్ని ప్రశంసించకుండా ఉండలేదు. అది సైనిక, ఏక పార్టీ ప్రభుత్వం కాబట్టి కరోనా వైరస్‌ను అదుపు చేసేందుకు అత్యంత కఠినంగా వ్యవహరించగలిగింది. కరోనా వైరస్ పుట్టిన వుహాన్ నగరాన్ని దాదాపు మూడు నెలల పాటు పకడ్బందీగా మూసివేయగలిగింది. ఇతర ప్రాంతాలలో కూడా ఇదే పద్ధతిని పాటించటంతో పాటు వైరస్ విస్తరించకుండా చూసేందుకు చైనా ప్రభుత్వం ప్రజల పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించింది. ఇది అన్ని దేశాల్లో సాధ్యం కాదు. సైనిక పాలన ఉన్న దేశాల్లో సాధ్యమయ్యేది ప్రజాస్వామ్య దేశాల్లో ఎంత మాత్రం సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో మన ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రులు వ్యవహరించిన తీరు అత్యంత ప్రశంసనీయమని చెప్పక తప్పదు. కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రజలను తమతో తీసుకుపోవటంలో ప్రధాన మంత్రి, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు విజయం సాధించారు. ప్రజలకు వారి బాధ్యతలను గుర్తు చేయటంతోపాటు తాము తీసుకున్న నిర్ణయాలను అమలు చేసేందుకు వారు చూపించిన దూరదృష్టి అభినందనీయం. నిత్యావసర వస్తువుల కొరత ఏర్పడకుండా చూడటం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను విజయవంతంగా అమలు చేయగలిగాయి. కేంద్ర, రాష్ట్రాల నాయకులు చూపించిన దారిలో నడుచుకోవటంలో దేశ ప్రజలు కూడా ఎంతో బాధ్యతతో వ్యవహరించారు. మెజారిటీ ప్రజలు ఇళ్లలోనే ఉండిపోవటం ద్వారా కరోనా వైరస్‌ను కట్టడి చేయటంలో అత్యంత ప్రశంసనీయమైన పాత్రను నిర్వహించారు. అమెరికా, ఇటలీ, ఫ్రాన్స్, ఇరాన్ తదితర దేశాల్లో వ్యాపించిన విధంగా మన దేశంలో కూడా కరోనా వైరస్ వ్యాపించి ఉంటే లక్షలు కాదు కోట్లాది మంది మరణించే వారు. అమెరికా, ఇటలీ, స్పెయిన్ తదితర దేశాలలో ఉన్న వైద్య సదుపాయాలతో పోలిస్తే మన దేశంలో ఉన్న వైద్య సదుపాయాలు ఎందుకూ పనికిరావు. మన దేశంలో కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి (కమ్యూనిటీ స్ప్రెడ్) జరిగి ఉంటే ఏమయ్యేదనేది ఊహిస్తే శరీరం భయంతో వణికిపోతుంది. కరోనా వైరస్ సామాజికంగా విస్తరించి ఉంటే ప్రతి రోజూ వేలాదిమంది మరణించే వారు. 1918లో ప్లేగ్ (స్పానిష్ ఫ్లూ) వచ్చినప్పుడు దేశంలో దాదాపుగా ఒక కోటి డెబ్బై లక్షల మంది మరణించారు. కరోనా వైరస్ సామాజికంగా విస్తరించి ఉంటే ఇప్పుడు 1918-20 మధ్య మరణించిన వారికంటే ఎంతో ఎక్కువమంది మృత్యువాత పడేవారు. 1918లో అప్పటి బొంబాయి నుండి వ్యాపించిన ప్లేగు దేశమంతా విస్తరించింది. స్పానిష్ ఫ్లూ మూలంగా దేశ జనాభాలోని ఐదు శాతం మంది ప్రజలు మరణించటంతోపాటు ఆ రెండేళ్లలో జనమరణాలు 30 శాతం తగ్గిపోయాయి.
ఇప్పుడు నరేంద్ర మోదీ, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కరోనా వైరస్ సామాజిక, సామూహిక వ్యాప్తి జరుగకుండా చేయగలగటం ద్వారా 1918 పరిస్థితులు పునరావృతం కాకుండా చేయగలిగారు. సరైన సమయంలో లాక్‌డౌన్ విధించటంతోపాటు దానిని కచ్చితంగా అమలు చేయటం ద్వారా కరోనా వైరస్ సామాజిక, సామూహిక వ్యాప్తి జరగకుండా చేయగలిగారు. లాక్‌డౌన్ అనగానే ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్ ప్రజల మాదిరిగా సామూహిక విందులకు దిగకుండా మన దేశ ప్రజలు ఎంతో విజ్ఞతతో వ్యవహరించారు. నూటికి ఎనభై శాతం మంది దేశ ప్రజలు లాక్ డౌన్‌ను గౌరవించటం ద్వారా కరోనావైరస్‌ను నిలువరింపగలిగారని చెప్పకతప్పదు. అయితే ముస్లిం మతానికి చెందిన కొందరు మాత్రం లాక్‌డౌన్‌ను పాటించకపోవటం మూలంగా దేశ ప్రజల ఆరోగ్యానికి ముప్పు తెచ్చే పరిస్థితులను సృష్టించారు. ముస్లిం మతానికి చెందిన కొందరు మత పెద్దలు మూఢత్వానికి ప్రాధాన్యత ఇవ్వటం ద్వారా తమ మతానికి చెందిన వేల మందిని కరోనావైరస్ బారిన పడవేశారు. కరోనా వైరస్ మహమ్మారి మరణ మృదంగం వాయిస్తూ కరాళ నృత్యం చేస్తోందని తెలిసి కూడా మతపరమైన సభలు, సమావేశాలు నిర్వహించటం, ప్రతి రోజు ఉదయం, సాయంత్రం ప్రార్థనలు నిర్వహించాలని ఆదేశించటం వారి బాధ్యతారాహిత్యానికి పరాకాష్ట. మతపరమైన సభలు, సమావేశాలు, ప్రార్థనలు నిర్వహించే స్వేచ్ఛ, అధికారం ముస్లిం మత పెద్దలకు ఉన్నప్పటికీ కరోనావైరస్ మహమ్మారి ప్రతి ఇంటి తలుపు తట్టుతున్న నేపథ్యంలో మర్కజ్ వంటి సభలు, సమావేశాలు, ప్రతి రోజూ ప్రార్థనలు నిర్వహించటం ద్వారా ఇతర మతస్తుల ప్రాణాలకు ముప్పు తెచ్చే అధికారం వారికి ఎంత మాత్రం లేదు. ఇంత వరకు దేశం మొత్తం మీద దాదాపు పదివేల మందికి కరోనా వైరస్ సోకింది, దాదాపు వెయ్యి మంది బాధితులు కోలుకోగా దాదాపు మూడు వందల మంది ఈ వ్యాధి మూలంగా మరణించారు. దేశం మొత్తం మీద దాదాపు పది వేల మందికి కరోనా సోకితే ఇందులో దాదాపు ముప్పై శాతం మంది అంటే మూడు వేల మంది తబ్లీగీ జమాత్ నిజాముద్దీన్ వద్ద నిర్వహించిన సభల మూలంగా కరోనా బారిన పడ్డారు. తబ్లీగీ జమాత్ మార్చి 10 నుండి పదమూడో తేదీ వరకు నిర్వహించిన మతపరమైన సమావేశం మూలంగా కరోనావైరస్ దేశంలోని ఇరవై రాష్ట్రాలకు వ్యాపించింది. కరోనా వైరస్ ముస్లింను ఏమీ చేయలేదంటూ తబ్లీగీ జమాత్ అధినాయకుడు వౌలానా సాద్ తమ వర్గం ప్రజలకు బోధించటం అత్యంత గర్హనీయం. మీరు కరోనా వైరస్ మూలంగా మసీదులో మరణిస్తే నేరుగా స్వర్గానికి వెళతారంటూ సాద్ తబ్లీగీ జమాత్ సమావేశానికి హాజరైన వారికి బోధించటం చూస్తుంటే ఆయన ఎంత బాధ్యతారహితంగా వ్యవహరించారనేది స్పష్టమవుతోంది. కరోనా వైరస్ తమను ఏమీ చేయదని ప్రగల్భాలు పలికిన వౌలానా సాద్ ఆ తరువాత పోలీసుల కళ్ళుగప్పి పలాయనం చిత్తగించారు. తబ్లీగీ జమాత్ మాదిరిగానే మరి కొందరు ముస్లిం మత పెద్దలు కూడా శుక్రవారం పూట సామూహిక మత ప్రార్థనలు నిర్వహించటం ద్వారా తమ వర్గం వారితో పాటు మొత్తం సమాజానికి ప్రమాదం తెచ్చి పెట్టారు. సౌదీ అరేబియా ప్రభుత్వం కరోనా భయంతో పవిత్ర మక్కా, మదీనాలను మూసి వేయటంతోపాటు వార్షిక హజ్ యాత్రను మానుకోవాలని ప్రపంచ ప్రజలకు పిలుపు ఇస్తుంటే మన దేశంలోని కొందరు ముస్లిం మత పెద్దలు మాత్రం ప్రార్థనలు నిర్వహణ కోసం పట్టుపట్టటం ఎంత మాత్రం మంచిది కాదు. ఊరందరిది ఒక దారైతే ఉలిపిరి కట్టెది మరో దారి అన్నట్లు వ్యవహరించటం వలన సమాజ హితం దెబ్బతింటుందనేది అందరు గ్రహించటం మంచిది. కరోనా వైరస్‌కు రాజు, పేద అనే వ్యత్యాసం లేదు. వాహబీ ఇస్లామిక్ పద్ధతిని పాటించే సౌదీ రాజకుటుంబానికి చెందిన 150 మంది కరోనా బారిన పడటం మన దేశంలోని ముస్లిం మత పెద్దలకు కనువిప్పు కావాలి. తిరుపతి వంటి పెద్ద, పెద్ద దేవాలయాలలో పూజలు ఆగిపోయాయి, చర్చ్‌లలో ప్రార్థనలు నిలిచిపోయాయి. ఇతర మతాలు వారు కూడా తమ మతపరమైన పూజలు, పునస్కారాలను నిలిపివేయటం ద్వారా కరోనా వ్యాప్తిని కట్టడి చేస్తుంటే కొందరు ముస్లిం మత పెద్దలు మాత్రం మతవ్ఢ్యౌంతో వ్యవహరించటం గర్హనీయం. కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మత వ్ఢ్యౌంతో వ్యవహరిస్తున్న వారి పట్ల కఠినంగా వ్యవహరించవలసిన అవసరం ఎంతో ఉన్నది. నిజాముద్దీన్‌లో తబ్లీగీ జమాత్ సభలు, సమావేశాలు జరుగకుండా ఉండి ఉంటే దేశంలో కరోనా వైరస్ ఈపాటికి బాగా అదుపులోకి వచ్చేది.

కె. కైలాష్ 98115 73262