రాష్ట్రీయం

అభివృద్ధి కోసమే టిఆర్‌ఎస్‌లోకి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎమ్మెల్యేలు గాంధీ, మాగంటి గోపీనాథ్
హైదరాబాద్, మార్చి 11: అభివృద్ధి కోసమే టిఆర్‌ఎస్‌లో చేరినట్టు టిడిపి నుంచి టిఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, మాగంటి గోపీనాథ్ తెలిపారు. శేరిలింగంపల్లి టిడిపి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ శుక్రవారం టిఆర్‌ఎస్‌లో చేరారు. క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గులాబీ కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలతో పాటు ఆ రెండు నియోజకవర్గాల పరిధిలోని డివిజన్ల అధ్యక్షులు, ముఖ్య నేతలు టిఆర్‌ఎస్‌లో చేరారు. జహీరాబాద్ నియోజకవర్గం నుంచి టిడిపి తరపున ఎంపీగా పోటీ చేసిన, టిఎన్‌ఎస్‌ఎఫ్ జాతీయ ఇన్‌చార్జి మదన్ మోహన్‌రావు, బోధన్ టిడిపి ఇన్‌చార్జి మాడపాటి ప్రకాశ్ రెడ్డి తదితరులు టిఆర్‌ఎస్‌లో చేరారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వరరావు, పట్నం మహేందర్ రెడ్డి, ఎంపి కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, జీవన్‌రెడ్డి, ప్రభాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, వివేకానంద, మాధవరం కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధి కోసమే టిఆర్‌ఎస్‌లో చేరినట్టు మాగంటి గోపీనాథ్ తెలిపారు. టిడిపి అంటే తనకు ఎంతో గౌరవం అని అయితే విశ్వనగరంగా హైదరాబాద్ అభివృద్ధి కోసం, బంగారు తెలంగాణ సాధన కోసం టిఆర్‌ఎస్‌లో చేరినట్టు చెప్పారు. నియోజకవర్గంలో అందరినీ కలుపుకొనిపోయి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ అమలు చేస్తున్న పలు పథకాలు తనకు నచ్చాయని మాగంటి తెలిపారు.
అభివృద్ధి కోసమే టిఆర్‌ఎస్‌లో చేరినట్టు అరికెపూడి గాంధీ తెలిపారు. టిడిపిలో తాను అంకితభావంతో పని చేశానని, తనకు సహాయ సహకారాలు అందించిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు చెప్పారు.