రాష్ట్రీయం

తగ్గుముఖం పట్టిన నేరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డిజిపి రాముడు వెల్లడి

విజయవాడ , డిసెంబర్ 31: గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం నేరాలు తగ్గుముఖం పట్టినట్లు డిజిపి జెవి రాముడు వెల్లడించారు. అయితే ఆర్ధిక నేరాలు పెరిగాయని, ఇక రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గినా.. మృతుల సంఖ్య మాత్రం పెరిగిందన్నారు. దీంతోపాటు వరకట్న మరణాల సంఖ్య కూడా పెరిగిందన్నారు. కొత్త సంవత్సరంలో రోడ్డు ప్రమాదాలను దాదాపుగా తగ్గించడమే ప్రాధాన్యతగా చెప్పారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌కు బ్రేక్ వేశామని, అక్కడక్కడ చిన్న చితక కేసులు నమోదవుతున్నట్లు చెప్పారు. మావోయిస్టుల ప్రభావం రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో ఉందన్నారు. సైబర్ నేరాల శాతం గత ఏడాది కంటే ఈసంవత్సరం 55శాతం మేర పెరిగిందని చెప్పారు. ఆర్ధిక నేరాలను కట్టడి చేసేందుకు ప్రతిపాదించిన మనీ ల్యాండర్స్ యాక్టు బిల్లు అసెంబ్లీలో పాస్ అయిందని తెలిపారు. విజయవాడలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో డిజిపి 2015 సంవత్సరాంత నేర నివేదికను వివరించారు. ఈసందర్భంగా ఆయన పలు ప్రాధాన్యత అంశాల గూర్చి ప్రస్తావించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి ఐపిఎస్ క్యాడర్ పోస్టులు కావాల్సి ఉందని, ఈమేరకు కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. రాష్ట్రంలో భర్తీ చేయాల్సిన ఐపిఎస్ క్యాడర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. అయితే ఐపిఎస్ అధికారుల కొరత వల్ల ఇప్పటికే ఉన్న పోస్టుల ర్యాంకులను కుదించి అందుబాటులో ఉన్న అధికారులకే ఆ బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. చత్తీస్‌గఢ్ రాష్ట్రానికి సరిహద్దు కావడం వల్ల మావోయిస్టుల ప్రభావం నాలుగు జిల్లాలకు ఉందని, ఇప్పటివరకు 96మందిని అరెస్టు చేయగా, మరో 100 మంది లొంగిపోయారని, 27 ఆయుధాలు సీజ్ చేశామన్నారు. ఎర్ర చందనం కేసులో 2710 స్మగ్లర్లను అరెస్టు చేశామని, వీరిలో 1330 మంది రాష్ట్రానికి చెందినవారు కాగా, 1367 మంది ఇతర రాష్ట్రాలవారని, 13మంది చైనా, నేపాల్, బర్మా వంటి విదేశాలకు చెందినవారిగా చెప్పారు. 40మంది అంతర్‌రాష్ట్ర ఎర్ర చందన స్మగ్లింగ్ ముఠాను అరెస్టు చేయగా, 11475 దుంగలు స్వాధీనం చేసుకున్నామని, 51మందిపై పిడి యాక్టు నమోదు చేసి 480 వాహనాలు సీజ్ చేశామన్నారు. విదేశాల్లో పట్టుబడిన గంగిరెడ్డి కేసు ప్రధానంగా వివరించారు. గత ఏడాది 398.35కోట్ల రూపాయల ఆర్ధిక నేరాలకు గాను, ఈ సంవత్సరం 7505.72 కోట్ల రూపాయల మేర 40.95శాతానికి క్రైం రేటు పెరిగిందన్నారు. గత ఏడాది 410 సైబర్ కేసులు నమోదైతే.. 2015లో 636 కేసులు నమోదయ్యాయని, మద్యం తాగి వాహనాలు నడపడం ద్వారా, మితిమీరిన వేగం వల్ల 7162మంది చనిపోగా, 26031మంది గాయపడ్డారని, ఈ ఏడాది కేసుల సంఖ్య 21126 నమోదుకాగా, 7439మంది చనిపోయారని, 27405మంది గాయపడ్డారని కేసులు తగ్గినా.. మరణాల సంఖ్య పెరిగిందన్నారు. ఆర్ధిక నేరాలకు సంబంధించి ఫైనాన్స్ సంస్థలను, వడ్డీ వ్యాపారులను నియంత్రించేందుకు మనీ ల్యాండర్స్ యాక్టు తీసుకువస్తామని, అదేవిధంగా డిపాజిటర్స్ యాక్టు, ఫారెస్ట్ యాక్టులో మార్పులు చేసేలా ప్రభుత్వాలకు నివేదిస్తామన్నారు. పోలీసు సంక్షేమానికి సంబంధించి భీమా కోసం కోటి 99లక్షల 51వేల 704రూపాయలు చెల్లించడం జరిగిందని చెప్పారు.