తెలంగాణ

డిపోల ఎదుట ఆర్టీసీ కార్మికుల ఆందోళనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: సీఎం కేసీఆర్ డెడ్‌లైన్ విధించినప్పటికీ ఆర్టీసీ కార్మికులు ఆందోళన బాట వీడలేదు. విధుల్లోకి వచ్చి చేరలేదు. ఈ రోజు డిపోల ఎదుట బస్సులు నడవకుండా ఆందోళన చేశారు. పలు డిపోల్లో కార్మికుల ఆందోళనలు జరిగాయి. మేడ్చల్ జిల్లా కుషాయిగూడ డిపో ఎదుట కార్మికులు నిరసన చేపట్టారు. సూర్యాపేట డిపో ఎదుట చేస్తున్న ధర్నాకు రాజకీయ పార్టీలు పాల్గొన్నాయి. జగిత్యాల డిపో ఎదుట ఆందోళన చేస్తున్న కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు. మంచిర్యాల, నాగర్‌కర్మూల్ డిపోల ఎదుట కూడా ఆందోళనలు చేశారు. కాచిగూడ డిపో ఎదుట జరిగిన ధర్నాలో సీపీఐ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆర్టీసీ బస్సులను ప్రైవేటు పరం చేస్తే కార్మికులు ఎక్కడికక్కడ అడ్డుకుంటారని తెలిపారు. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలను చూడలేకే రాజకీయ పార్టీలు వారికి అండగా నిలిచాయని అన్నారు. ఇప్పటికైనా జేఏసీని పిలిచి సమస్యను పరిష్కరించాలని అన్నారు.