కృష్ణ

సీమ దేవాలయాల అభివృద్ధికి రూ.3 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవనిగడ్డ, మార్చి 12: కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని దివిసీమలోని పలు ఆలయాల అభివృద్ధికి రూ.3కోట్లు మంజూరైనట్లు ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. శనివారం ఆయన తన ఛాంబర్‌లో విలేఖర్లతో మాట్లాడుతూ ఘంటసాల మండలం శ్రీకాకుళం శ్రీకాకుళేశ్వర స్వామి ఆలయానికి అత్యధికంగా రూ.25.94లక్షలు మంజూరు కాగా శ్రీకాకుళంలోని ఏకరాతి ప్రసన్న మల్లిఖార్జున స్వామి ఆలయంకు రూ.9.65లక్షలు, సోమేశ్వర స్వామి ఆలయానికి రూ.7.26లక్షలు, చల్లపల్లి మండలం నడకుదురులో శ్రీ పృధ్వీశ్వర స్వామి ఆలయానికి రూ.6లక్షలు, మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి రూ.20.53లక్షలు, పెదకళ్ళేపల్లి శ్రీ దుర్గా నాగేశ్వర స్వామి ఆలయానికి రూ.16లక్షలు, కె.కొత్తపాలెం శ్రీవేణుగోపాల స్వామి ఆలయానికి రూ.4.32లక్షలు, మల్లేశ్వర స్వామి ఆలయానికి రూ.5.78లక్షలు, పెదకళ్ళేపల్లిలోని మదనగోపాల స్వామి ఆలయానికి రూ.7.04లక్షలు, అభయాంజనేయ స్వామి ఆలయానికి రూ.3.31లక్షలు, పెదప్రోలు చెన్నకేశవస్వామి ఆలయానికి రూ.7.09లక్షలు, సకలేశ్వర స్వామి ఆలయానికి రూ.2.57లక్షలు, అవనిగడ్డ శివాలయానికి రూ.14లక్షలు, లంకమ్మ అమ్మవారి ఆలయానికి రూ.14లక్షలు, పులిగడ్డ కనకదుర్గమ్మ ఆలయానికి రూ.3.65లక్షలు, వెంకటేశ్వర స్వామి ఆలయానికి రూ.5.92లక్షలు, వేకనూరు ముక్తేశ్వర స్వామి ఆలయానికి రూ.3.54లక్షలు, వెంకటేశ్వర స్వామి ఆలయానికి రూ.3.41లక్షలు, కోడూరు కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయానికి రూ.22.04లక్షలు, విశ్వనాధపల్లి అద్దంకి నాంచారమ్మ ఆలయానికి రూ.18.27లక్షలు, విశ్వనాధపల్లి అన్నపూర్ణ కాశీ విశే్వశ్వర స్వామి ఆలయానికి రూ.3.55లక్షలు, మాచవరం రామేశ్వర స్వామి ఆలయానికి రూ.3.51లక్షలు, సాలెంలెంలో అగస్తేశ్వర స్వామి ఆలయానికి రూ.1.18లక్షలు, లింగారెడ్డిపాలెం గోకర్ణేశ్వర స్వామి ఆలయానికి రూ.1.69లక్షలు, రామచంధ్రపురం బాల సోమేశ్వర స్వామి ఆలయానికి రూ.7.73లక్షలు, నాగాయలంకలోని కనకదుర్గమ్మ ఆలయానికి రూ.16.19లక్షలు, టి.కొత్తపాలెం భ్రమరాంబ మల్లేశ్వర స్వామి ఆలయానికి రూ.3.14లక్షలు, రేమాలవారిపాలెం సీతారామ స్వామి ఆలయానికి రూ.6.25లక్షలు, నాగాయలంక వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయానికి 2.71లక్షలు, వెంకటేశ్వర స్వామి ఆలయానికి రూ.1.31లక్షలు, గణపేశ్వరం దుర్గా గణపేశ్వర ఆలయానికి రూ.8.87లక్షలు, నంగేగడ్డ వీరభద్ర నరేంద్ర స్వామి ఆలయానికి రూ.1.24లక్షలు, సంగమేశ్వరంలోని సంగమేశ్వర స్వామి ఆలయానికి రూ.7.72లక్షలు, భావదేవరపల్లి భావన్నారాయణ స్వామి ఆలయానికి రూ.6.95లక్షలు మంజూరైనట్లు బుద్ధప్రసాద్ తెలిపారు.