రాష్ట్రీయం

బాబుకు షికాగో వర్శిటీ డాక్టరేట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్ర అభివృద్ధికి గుర్తింపుగా పురస్కారం
హైదరాబాద్, డిసెంబర్ 17: ప్రపంచ ప్రసిద్ధి చెందిన షికాగో స్టేట్ యూనివర్శిటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడుకు గౌరవ డాక్టరేట్‌ను ప్రకటించింది. పురస్కారంపై చంద్రబాబునాయుడు స్పందిస్తూ ప్రజల గుర్తింపే తనకు డాక్టరేట్ అని, ప్రజల మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిపోవడమే తనకు నిజమైన పురస్కారమని వ్యాఖ్యానించారు. గతంలో ఎన్నో విశ్వవిద్యాలయాలు డాక్టరేట్‌లు ఇవ్వడానికి ముందుకు వచ్చాయని, ఆ ప్రతిపాదనలను తాను సున్నితంగా తిరస్కరించానని చెప్పారు. ఈ పురస్కారం వల్ల రెండు దేశాల సంబంధాలు మరింత మెరుగుపడాలని ఆశిస్తున్నట్టు చంద్రబాబు పేర్కొన్నారు. ముఖ్యమంత్రికి గౌరవ డాక్టరేట్‌పై మంత్రులు అంతా సంతోషాన్ని వ్యక్తం చేశారు.