తెలంగాణ

కొత్త జిల్లాలకు డ్రాప్ట్ నోటిఫికేషన్ విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణలో జిల్లాల పునర్విభజనకు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ సోమవారం విడుదలైంది. తొమ్మిది జిల్లాలకు వేర్వేరుగా ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. 27 జిల్లాలు, 58 రెవెన్యూ డివిజన్లతో కొత్త నోటిఫికేషన్ విడుదల అయింది. ప్రస్తుతం రాష్ట్రంలో పది జిల్లాలు, 44 రెవెన్యూ డివిజన్లు, 459 మండలాలున్నాయి. ప్రభుత్వం విడుదల చేసిన పునర్విభజన ముసాయిదా ప్రకారం మొత్తం 27 జిల్లాలు, 58 రెవెన్యూ డివిజన్లు, 490 మండలాలుగా రాష్ట్ర పరిపాలనా ముఖచిత్రం మారిపోనుంది. కలెక్టరేట్లు, సీసీఎల్ఏలో అభ్యంతరాల స్వీకరణకు నెల రోజుల గడువు ప్రకటించింది. గడువులోగా వచ్చిన అర్జీలన్నీ పరిశీలించి జిల్లాల తుది నోటిఫికేషన్‌నువిడుదల చేస్తుంది. ఈ ప్రక్రియను సెప్టెంబరు 30 లోగా పూర్తి చేసి, దసరా పండుగ నుంచి కొత్త జిల్లా కేంద్రాల నుంచి పరిపాలన ప్రారంభించేలా సన్నాహాలు మొదలయ్యాయి.