రాష్ట్రీయం

కరవు నిధుల సంగతి చూడండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంత్రి పోచారానికి సిఎం కెసిఆర్ ఆదేశం
ఢిల్లీ వెళ్లాలని ఆదేశం
హైదరాబాద్, డిసెంబర్ 29: కరవు బారినపడిన రాష్ట్రానికి కేంద్రం నుంచి అందాల్సిన సాయాన్ని వెంటనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు కోరారు. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రిని కలిసి వెంటనే సాయం అందించాలని కోరేందుకు ఢిల్లీ వెళ్లాల్సిందిగా వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డిని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో దాదాపు 60 శాతం ప్రాంతం కరవు బారిన పడిందని, రైతులు ఎంతో నష్టపోయారని ముఖ్యమంత్రి అన్నారు. కరవుపై సమగ్ర నివేదికను కేంద్రానికి పంపించగా, కేంద్ర బృందం కూడా రాష్ట్రంలో పర్యటించి వెళ్లిందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ఇక కేంద్రం నుంచి రాష్ట్రానికి అందించాల్సిన సాయాన్ని వెంటనే విడుదల చేసి రైతులను ఆదుకోవాలని ముఖ్యమంత్రి కోరారు. కేంద్ర ప్రభుత్వంలో కదలిక తెచ్చేందుకు అధికారులను కూడా ఢిల్లీకి తీసుకెళ్లాల్సిందిగా మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డిని ముఖ్యమంత్రి ఆదేశించారు.
అక్షరాస్యతపై దృష్టి
రాష్ట్రాన్ని వందశాతం అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ప్రభుత్వం పేద ప్రజల కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని, ఇవన్నీ సంపూర్ణంగా, పారదర్శకంగా అమలు కావాలంటే ప్రజలంతా అక్షరాస్యులు కావడం చాలా అవసరం అని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.