ఆంధ్రప్రదేశ్‌

ముద్రగడ తీరుతో కాపులకే నష్టం : చినరాజప్ప

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమలాపురం: మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వైఖరితో కాపు కులస్థులకు అన్యాయం జరిగే పరిస్థితి నెలకొందని డిప్యూటీ సిఎం నిమ్మకాయల చినరాజప్ప బుధవారం ఇక్కడ మీడియాతో చెప్పారు. వైకాపా అధినేత జగన్, ముద్రగడ కలిసి ఈ నాటకం ఆడుతున్నారని ఆయన ఆరోపించారు. తుని విధ్వంసకాండకు సంబంధించి ఎవరినీ విడిచిపెట్టేది లేదని నిందితులందర్నీ పోలీసులు అరెస్టు చేసి కేసులు పెడతారని అన్నారు. అరెస్టులకు నిరసనగా ముద్రగడ దీక్షలు చేసినా ప్రభుత్వం భయపడే ప్రసక్తే లేదన్నారు. ముద్రగడ ఆమరణ దీక్ష చేస్తే దానికి ప్రభుత్వం బాధ్యత వహించదన్నారు.