తెలంగాణ

ఎఎస్‌ఐపై దాడికి డిప్యూటీ మేయర్ యత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్: ఎఎస్‌ఐతో పాటు ట్రాఫిక్ పోలీసులపై దాడికి యత్నించినట్లు ఆరోపణలు రావడంతో నగర డిప్యూటీ మేయర్ ఎంఎ ఫరుూంపై స్థానిక వన్‌టౌన్ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. ఇక్కడి బస్టాండ్ ప్రాంతంలో ట్రాఫిక్ పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తూ డిప్యూటీ మేయర్ కుమారుడు బషీర్ అద్నాన్ (24) వెళుతున్న బైక్‌ను ఆపారు. బైక్‌కు సంబంధించి పత్రాలను చూపాలని ట్రాఫిక్ పోలీసులు అడగడంతో అద్నాన్ ఆగ్రహం వ్యక్తం చేసి, ఈ విషయాన్ని తన తండ్రికి ఫోన్‌లో తెలిపాడు. కొంతసేపటికి అక్కడికి వచ్చిన డిప్యూటీ మేయర్ ట్రాఫిక్ పోలీసులపై దాడికి యత్నించి ఎఎస్‌ఐ శ్యామ్ చొక్కా పట్టుకుని కేకలు వేశారు. డిప్యూటీ మేయర్ తమపై దౌర్జన్యానికి యత్నించినట్లు ట్రాఫిక్ పోలీసులు వన్‌టౌన్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.