రాష్ట్రీయం

వీడియో కాన్ఫరెన్స్‌కు అంతరాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డిప్యూటీ తహశీల్దార్ సస్పెన్షన్
విజయనగరం, డిసెంబర్ 26: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు అంతరాయం కలిగించిన విజయనగరం జిల్లా మెంటాడ మండలానికి చెందిన ఇద్దరు అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. వారిపై ముఖ్యమంత్రి వీడియో తీవ్ర అగ్రహం వ్యక్తం చేస్తూ చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను సిఎం ఆదేశించారు. ఈ మేరకు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న మెంటాడ డిప్యూటీ తహశీల్దార్ రామకృష్ణ, ఎంపిడిఓ కార్యాలయ సూపరింటెండెంట్ గంటా వెంకటారావును సస్పెండ్ చేస్తూ శనివారం రాత్రి కలెక్టర్ ఎంఎం నాయక్ ఆదేశాలు జారీచేసారు. శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్టవ్య్రాప్తంగా కలెక్టర్లు, ఆర్‌డిఓలు, తహశీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మెంటాడ తహశీల్దార్ సెలవులో ఉండడంతో డిప్యూటీ తహశీల్దార్, ఇతర సిబ్బంది వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి మాట్లాడుతున్న సందర్భంలో మెంటాడ తహశీల్దార్ కార్యాలయ సిబ్బంది మైక్ ఆన్‌చేసి ఎవరి పనుల్లో వారు ఉండడం, గట్టిగా మాట్లాడుకోవడంతో వీడియో కాన్ఫరెన్స్‌కు అంతరాయం ఏర్పడింది. దాంతో ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేస్తూ బాధ్యతారహితంగా వ్యవహరించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దాంతో కలెక్టర్ నాయక్ ఆదేశాల మేరకు జిల్లా రెవెన్యూ అధికారి విచారణ జరిపి ఇచ్చిన నివేదిక ఆధారంగా మెంటాడ డిప్యూటీ తహశీల్దార్, మండల పరిషత్ సూపరింటెండెంట్లను సస్పెండ్ చేసారు.