మహబూబ్‌నగర్

ఇసుక లారీలను అడ్డుకున్న గ్రామస్థులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిడ్జిల్, జనవరి 21: దుందుబీ వాగు నుండి అక్రమంగా ఇసుక రవాణ చేస్తున్న ఆరు లారీలను మున్ననూర్ గ్రామస్ధులు గురువారం అడ్డుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు. మిడ్జిల్ తహశీల్దార్ పాండునాయక్ మున్ననూర్‌కు చేరుకుని గ్రామస్థులు అడ్డుకున్న ఇసుక లారీలను సీజ్ చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు.
కాగా గ్రామస్థులు మాత్రం తమ గ్రామ సమీపంలో గల దుందుబీ వాగు దగ్గర ఇసుక తవ్వకాలు జోరుగా జరుగుతున్నాయని తక్షణమే నిలిపి వేయాలని గ్రామస్ధులు డిమాండ్ చేశారు. మైనింగ్ అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఇసుక తవ్వకాలను వారే ప్రొత్సహిస్తున్నారని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై తహశీల్దార్ పాండు నాయక్ కూడా మైనింగ్ అధికారుల తీరును తప్పుబట్టారు. తమకు తెలియకుండా మైనింగ్ శాఖ అనుమతులు ఇవ్వడం ఏమిటని తహశీల్దార్ పాండునాయక్ ప్రశ్నించారు. పట్టుకున్న లారీలను పోలీసులకు అప్పగిస్తున్నట్లు తహశీల్దార్ పాండునాయక్ తెలిపారు. ఆరు లారీలను సీజ్ చేయడం జరిగిందని ఆయన పెర్కోన్నారు. గ్రామస్థులు అడ్డుకోవడంతో ఇసుక మాఫియాకు అడ్డుకట్ట పడింది. కొన్ని రోజుల నుండి దుందుబీ వాగు నుండి ఇష్టానుసారంగా ఇసుకను తరలిస్తూ లక్షలాది రుపాయలు దండుకుంటున్న ఇసుక మాఫియా ఆగడాలను అరికట్టాలంటూ మున్ననూరు గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.
ఇసుక క్వారీని రద్దు చేయాలంటూ
అఖిలపక్ష నేతల ధర్నా
మున్ననూర్ సమీపంలో ఇసుక క్వారీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం మిడ్జిల్ తహశీల్దార్ కార్యాలయం ఎదుట బిజెపి, బిఎస్‌పి, ఎంఆర్‌పిఎస్, యువజన సంఘాలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఎంఆర్‌పిఎస్ జిల్లా అధ్యక్షుడు జంగయ్య మాట్లాడుతూ మున్ననూర్ దగ్గర ఏర్పాటు చేసిన ఇసుక క్వారీని ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వాగులో ఇసుకను తవ్వుతుండడంతో వ్యవసాయ బోర్లలో భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయని ఆరోపించారు. అధికారులు రైతులు, ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని క్వారిని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజేశ్వర్, శేఖర్, తిరుపతయ్య, రాజు, గణేష్, తిరుమల జంగయ్య తదితరులు పాల్గొన్నారు.