రాష్ట్రీయం

ఈసారి మరింత ఘనంగా యోగా దినోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: జూన్ 21వ తేదీన జరగబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఈసారి మరింత వైభవంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజల్ని, ముఖ్యంగా విద్యార్థులను యోగావైపు ఆకర్షించే రీతిలో ఆసనాలతో పాటు ఇతర కార్యక్రమాలను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందుకు సంబంధించి ఆయుష్ మంత్రి శ్రీపాద్ యశోనాయక్ మాట్లాడుతూ గత ఏడాది కన్నా ఈసారి మరింత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే యోగాకు విస్తృత ప్రచారం కల్పించేందుకు దేశవ్యాప్తంగా పాఠశాల విద్యార్థులకు ‘యోగా ఒలింపియాడ్’ నిర్వహించాలని కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖను కోరినట్లు ఆయన తెలిపారు. యోగా దినోత్సవం రోజున ప్రారంభ కార్యక్రమంలో 45 నిమిషాల పాటు ప్రత్యేక ఆసనాల కార్యక్రమం ఉంటుందని, ఈ బాధ్యతను యోగా గురువులతో ఏర్పడిన నిపుణుల కమిటీకి అప్పగించామని శ్రీపాద్ యశోనాయక్ వెల్లడించారు. అలాగే వివిధ రాష్ట్రాల్లో ఉన్న యోగా సంస్థలు ఇందుకు సంబంధించిన కార్యక్రమాల రూపకల్పనకు అవసరమైన సహకారాన్ని అందించాలని కోరనున్నట్లు పేర్కొన్నారు. అలాగే నెలరోజులపాటు యోగా శిక్షణ నిర్వహించే ఎన్‌జిఓ సంస్థలకు సెంటర్ ఫర్ సపోర్ట్ ఫర్ యోగా అండ్ నేచురోపతి సంస్థ నిధులు మంజూరు చేయనుంది.