సంపాదకీయం

పాకిస్తాన్‌కు ‘గులాం’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్ద కరెన్సీ నోట్లను రద్దు చేయడంతో దేశప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను చూసి ప్రతిపక్ష రాజకీయవాదులు కడవలతో కన్నీరు కార్చడం నడుస్తున్న చరిత్ర. ఈ కన్నీటి కాలువలు పార్లమెంటు ఉభయ సభల సమావేశాలను ముంచెత్తుతున్నాయి. ప్రతిపక్షాలకు- ప్రధానంగా 2004 నుంచి పదేళ్లపాటు కేంద్ర ప్రభుత్వాన్ని నిర్వహించి, నల్లడబ్బును వెలికితీయడంలో విఫలమైన కాంగ్రెస్ పార్టీ వారికి ఇపుడు ఈ మానవీయ శ్రద్ధ- హ్యుమన్ ఇంటరెస్ట్- పొటమరించడం రాజకీయ అనివార్యం! కానీ, పెద్దనోట్ల రద్దు ద్వారా మోదీ ప్రభుత్వం తలపెట్టిన నల్లడబ్బు వెలికితీత కార్యక్రమాన్ని- మన సైనికులకు, ప్రజలకు వ్యతిరేకంగా పాకిస్తాన్ ప్రేరిత ఉగ్రవాదులు జరుపుతున్న బీభత్సకాండతో సరిపోల్చడానికి చట్టసభల్లో సాహసించిన రాజకీయ వేత్తలను చూసి జనం మెచ్చుకుంటారా? నొచ్చుకుంటారా? గులాం నబీ ఆజాద్ అనే రాజకీయవేత్త ఈ దుస్సాహసానికి పాల్పడ్డాడు. ఆయన సామాన్యుడు కాదు. రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు. మానవీయ శ్రద్ధ అన్న ముసుగులోనుంచి తొంగిచూసిన దేశ వ్యతిరేకతకు ఇది మరో నిదర్శనం. రాజ్యసభలో కాంగ్రెస్ నాయకుడు గు లాం నబీ ఆజాద్ గురువారం చేసిన వ్యాఖ్యలలో దేశ వ్యతిరేకత దృశ్యమానమైంది. అధికార భారతీయ జనతాపార్టీ స భ్యులు ఆజాద్ వ్యాఖ్యల పట్ల వ్యతిరేకతను వ్యక్తం చేయడం హర్షణీయం. కానీ, జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సైనికులను అవమానించడం, భద్రతాదళాలను అనుమానించడం, వారిపై నిందలను వేయడం దేశ వ్యతిరేక చర్యలకు జమ్మూ కాశ్మీర్‌లోని విచ్ఛిన్నవాదులు నిరంతరం పాలుపడుతున్నారు. గులాం నబీ ఆజాద్ విచ్ఛిన్నకారుడు కాదు. జుమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, రాజ్యాంగబద్ధ రాజకీయవేత్త! రాజ్యాంగ నిబద్ధత అన్నది కృతకమై తాత్కాలికమైన రాజకీయంతో ముడివడిలేదు. తరతరాల జాతీయతా స్వభావానికి ‘రాజ్యాంగ బద్ధత’ ఒక ధ్రువీకరణ. అందువల్ల తమకు రాజ్యాంగ నిబద్ధత ఉందని చెప్పడం ద్వారా చెబుతున్నవారు తమకు ఈ మాతృభూమి పట్ల భక్తి ఉందని, ఈ దేశ సర్వసత్తాక స్వాతంత్య్ర పరిరక్షణ పట్ల నిష్ఠ ఉందని ప్రకటించుకుంటున్నారు. మరి గులాం నబీ ఆజాద్ రాజ్యసభలో ప్రకటించింది ఏమిటి? చిన్ననోట్లు తీసుకొనడానికి బ్యాంకుల వద్ద, ఎటిఎంల వద్ద బారులు తీరిన వారిలో నిలబడలేక కొందరు, నోట్లు దొరకని మనస్తాపంతో కొందరు, గుండెపోటుతో ఇంకొందరు చనిపోయారు. పెళ్లిళ్లు ఆగినందున మరికొందరు హఠాత్తుగా మరణించారు. ఈ అకాల మరణాలకు బలైన వారి కుటుంబాల పట్ల దేశ ప్రజలందరూ సహానుభూతి చూపుతున్నారు. ప్రభుత్వం కూడా ఈ అకాల మరణాలు మళ్లీ సంభవించకుండా నిరోధక చర్యలు తీసుకొంటోంది. నోట్లరద్దు వల్ల మరణించిన వారి సంఖ్యను జమ్మూ కాశ్మీర్‌లోని ఊరీ ప్రాంతంలో సెప్టెంబర్ 18న టెర్రరిస్టుల దాడికి బలైపోయిన మన సైనికుల సంఖ్యతో సరిపోల్చవలసిన అవసరం ఏమిటి? గులాం నబీ ఆజాద్ సరిపోల్చాడు. ‘నోట్లరద్దు’ మృతుల సంఖ్య- ఊరీలో మరణించిన సైనికుల సంఖ్య కంటే రెండింతలు ఎక్కువ అని రాజ్యసభలో వ్యాఖ్యానించాడు.
ఊరీలో పదిహేడుమంది మన సైనికులు మరణించింది- పాక్ ప్రేరిత జిహాదీ బీభత్సకారులు పథకం ప్రకారం, దుర్బుద్ధి పూర్వకంగా జరిపిన దాడిలో.. ఇది మనదేశాన్ని బద్దలు కొట్టడానికి పాక్ ప్రభుత్వం, ఆ ప్రభుత్వ ప్రేరిత జిహాదీలు దశాబ్దుల తరబడి జరుపుతున్న పైశాచిక కాండలో భాగం! సరిహద్దుల రక్షణ, దేశమాత యశోవిభవ పరిరక్షణ తమ ఆజీవన వ్రతంగా త్యాగమయ జీవనాన్ని గడిపిన మన సైనికులను టెర్రరిస్టులు హత్యచేశారు. ఎటిఎంల వద్ద, బ్యాంకుల వద్ద నిలబడలేక మరణించిన వారిని, ఇతర కష్టాలను ఓర్చలేక అసువులు బాసిన వారిని మన ప్రభుత్వం హత్య చేయలేదు. ఎవ్వరూ హత్య చేయలేదు. ‘నోట్లరద్దు’ను ప్రకటించిన ప్రభుత్వ లక్ష్యం దేశ ప్రజలను నల్లధనం పెంచుతున్న ఆర్థిక బీభత్సకారుల బారి నుంచి పరిరక్షించడం. ఊరీలో సైనికులను చంపిన దుర్మార్గుల లక్ష్యం భారత్‌ను భక్షించడం. జిహాదీలది మన దేశ వ్యతిరేక విష వ్యూహం. మన ప్రభుత్వానిది దేశ పరిరక్షణ కార్యక్రమం. అందువల్ల ఊరీలో హత్యాకాండ జరిపిన పాకిస్తానీ జిహాదీలకు, నోట్లను రద్దు చేసిన మన ప్రభుత్వ చర్యకూ మధ్య ఎలాంటి పోలిక లేదు. ఈ రెండూ పరస్పరం తీవ్రంగా విరోధిస్తున్న చర్యలు. అందువల్ల ‘పోలిక’ తేవడానికి ప్రయత్నించడం మతిలేని చర్య, అతార్కిక ప్రయత్నం, దేశ ప్రజల మనోభావాలకు విఘాత కారణమైన దుశ్చర్య. గులాం నబీ ఆజాద్ ఈ దుశ్చర్యకు ఒడిగట్డాడు! కేంద్రమంత్రి ఎం.వెంకయ్యనాయుడు, బిజెపి ఎంపీలు, కార్యకర్తలు, సాధారణ ప్రజలు ఆజాద్ చర్యను అభిశంసించడం సముచితమైన ప్రతిస్పందనకు నిదర్శనం. ‘గు లాం నబీ ఆజాద్ జాతి విద్రోహ చర్యకు ఒడిగట్టాడన్న’ వెంకయ్య నా యుడి నోట ప్రజల మాట వెలువడింది. రా జ్యసభ అధ్యక్షుడు ఆ జాద్‌ను ఎందుకు మం దలించలేదో..?
పెద్దనోట్ల రద్దుపై చర్చలు, రభసలు జరిగిన సందర్భంగా ఆజాద్‌కు ఊరీ దుర్ఘటన ఎందుకు స్ఫురించింది? ‘పెద్దనోట్ల’ బాధిత మృతుల సంఖ్యను సరిపోల్చడానికి ఇతర ఘటనలను ఆయన ఎందుకని ఉంటంకించలేదు? రైలు ప్రమాదాలను, విమాన ప్రమాదాలను, రోగాలను, ఇతరేతర దుర్ఘటనలతో ఆయన ‘ఎటిఎం’ మృతులను సరిపోల్చి ఉండవచ్చు. అసలు సరిపోల్చవలసిన అవసరం ఏమిటి? ఆయనకు ఊరీ దుర్ఘటన స్ఫురించడం హృదయాంతరాలలో నక్కి ఉన్న సైనిక వ్యతిరేకతకు నిదర్శనం. జమ్మూ కాశ్మీర్‌కు 2005 నవంబర్ నుంచి మూడేళ్లు ముఖ్యమంత్రిగా ఉండిన సమయంలో సైతం గులాం నబీ ఈ వ్యతిరేకతను వెళ్లగక్కాడు. కాశ్మీర్ నుంచి సైనికులను ఉపసంహరించాలన్న విచ్ఛిన్నకారుల కోర్కెను ఆయన సమర్థించాడు. కాశ్మీర్‌లో సైనికుల ఉనికి పాకిస్తాన్ ప్రేరిత జిహాదీ ముఠాలకు, వారిని సమర్థిస్తున్న ‘లోయ’ ప్రాంతంలోని దేశద్రోహులకు నచ్చని వ్యవహారం. అందువల్ల కాశ్మీర్‌లోని ప్రాంతీయ పక్షాల రాజకీయ వేత్తలు సైనిక దళాలను ఉపసంహరించాలని కోరుతున్నారు. ఇది దశాబ్దులుగా కొనసాగుతున్న వైపరీత్యం. కాంగ్రెస్ వంటి జాతీయ రాజకీయ పక్షానికి చెందిన ఆజాద్, పి.చిదంబరం, దిగ్విజయ్ సింగ్ వంటివారు సైతం ఈ ‘విచ్ఛిన్న వాంఛ’ను తరచూ వ్యక్తం చేసి ఉన్నారు. మన సైనికులు వైదొలగిన చోటల్లా పాకిస్తానీ జిహాదీలు మరింతగా పేట్రేగడం చరిత్ర! అందువల్ల కాశ్మీర్ నుంచి సైనిక దళాలను ఉపసంహరించాలని కోరడం మన దేశానికి వ్యతిరేకమైనది, పాకిస్తాన్‌కు అనుకూలమైనది..
ఆజాద్ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ‘అఫ్జల్‌గురు’ అనే కరడుకట్టిన బీభత్సకారుడిని శిక్షించరాదని విచ్ఛిన్న వాదులు విద్రోహ యాత్రలు జరిపారు. అఫ్జల్‌గురును శిక్షిస్తే కాశ్మీర్ అగ్నిగుండంగా మారుతుందన్న హెచ్చరికలు కూడా వినిపించాయి. అఫ్జల్‌గురును శిక్షించరాదని ఆజాద్ ముఖ్యమంత్రి హోదాలో ప్రకటించడం చరిత్ర.. ముఖ్యమంత్రిగా ఉన్నవాడు ఇలా ప్రకటించ వచ్చునా? అన్న ప్రశ్నకు ఆజాద్ చెప్పిన సమాధానం- ‘అలా ప్రచారం జరగడం వల్ల కాశ్మీర్‌లో కల్లోలాలు సద్దుమణిగి పోయాయి’ అని. అఫ్జల్‌గురుకు మరణదండన అమలు జరిగినపుడు కాశ్మీర్ అగ్నిగుండంగా మారలేదు. ఒక టెర్రరిస్టుకు అనవసరమైన ప్రాధాన్యం కల్పించిన ఘనత మాత్రం ఆజాద్‌కు దక్కింది. అగ్నిగుండం కాకుండా నిరోధించిన వారు, నివారిస్తున్నవారు భరతమాత వజ్రాల బిడ్డలైన సైనికులు..