సంపాదకీయం

సౌదీ దౌత్య దౌర్జన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన ప్రభుత్వం సకాలంలో ప్రతిస్పందించకపోవడం మరింత దిగ్భ్రాంతికరం! దాదాపు ఏడాదిపాటు ఈ ఘోరం కొనసాగుతున్నప్పటికీ నివారించడానికి మన ప్రభుత్వం పూనుకోలేదన్నది స్పష్టం. పూనుకొని ఉండి ఉంటే ఇంతమంది అభాగ్యుల మృతదేహాలు నెలల తరబడి అక్కడ పడి ఉండేవి కావు. సౌదీ అరేబియాకు వెళ్లి ఉద్యోగాలు చేసి డబ్బు సంపాదించాలని కలలుగన్న అభాగ్యుల మృతదేహాలు అవన్నీ. సౌదీ అరేబియాలోని వివిధ ‘శవాగారాల’- మార్చురీస్-లో నూట యాబయి మంది భారతీయుల పార్ధివ శరీరాలు కుళ్లిపోవడానికి సిద్ధంగా ఉన్నాయట! ఈ భౌతికకాయాలను మన దేశానికి తరలించుకొని రావడానికి కాని, అక్కడే అంతిమ సంస్కారం జరపడానికి కానీ వీలులేని దౌర్భాగ్య స్థితి ఏర్పడింది. ఈ దుస్థితిని కలిగించిన వారు సౌదీ అరేబియాలోని సంపన్నులు, యజమానులు, సౌదీ ప్రభుత్వం వారు, ఆ దేశంలో ఇస్లాం ఏకమత రాజ్యాంగ వ్యవస్థను కొనసాగిస్తున్న వారు. ఈ ఏకమత రాజ్యాంగం మత వ్ఢ్యౌన్ని, మతోన్మాదాన్ని, మత విద్వేషాన్ని పెంచి పోషించింది. ఈ విద్వేషం ‘జిహాదీ’లను సృష్టించడం చరిత్ర! అందువల్ల ‘క్రౌ ర్యం’, ‘నిర్దాక్షిణ్యం’ సౌదీ అరేబియా సమాజ సమష్టి స్వభావంగా మారింది. ఇతర మతస్థులను, ఇతర దేశస్థులను, ఇతర జాతులను నిర్దయగా హిం సించడం, చంపడం సౌదీ అరేబియాలోని సంపన్న యజమానుల జీవనరీతిగా మారింది. ఉపాధి కోసం తమ దేశానికి వస్తున్న విదేశీయులను క్రిమికీటకాదుల వలే భావించి చిత్రహింసలకు గురి చేస్తున్నారు. ఈ పైశాచిక ప్రవృత్తి సౌదీ అరేబియాలోని అత్యధికులలో శతాబ్దులుగా నెలకొని ఉంది. క్రౌర్యం ఈ పైశాచిక ప్రవృత్తికి ప్రాతిపదిక! అంతర్జాతీయ ‘జిహాద్’ను సాగిస్తున్న వివిధ బీభత్స ముఠాలకు పాకిస్తాన్ ప్రభుత్వ సంస్థ ‘ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజన్స్’- ఐఎస్‌ఐ-వారు శిక్షణ ఇస్తున్నారు, ఆయుధాలను సరఫరా చేస్తున్నారు, అనుసంధానం చేయిస్తున్నారు. ఈ అనుసంధాన వ్యవస్థకు ‘సైద్ధాంతిక’ స్ఫూర్తిని సౌదీ అరేబియా ‘ప్రదానం’ చేస్తోంది. సౌదీ అరేబియా సంపన్నులు ‘జిహాదీ’లకు ధారాళంగా నిధులను సమకూర్చుతున్నారు. ప్రపంచంలోని అన్ని ఇతర మతాలను నిర్మూలించి ఇస్లాంను ఏకైక మతంగా ప్రతిష్ఠించడం జిహాద్ లక్ష్యం. అందువల్ల అధికసంఖ్యలో ఇస్లామేతర మతాల ప్రజలున్న దేశాల పట్ల సౌదీలోని జనానికి సుహృద్భావం లేదు. మత రాజ్యాంగ వ్యవస్థలున్న అన్ని ఇస్లాం దేశాలలోని అధికాధిక ప్రజలు జిహాద్‌ను బలపరుస్తున్నారు. 2008 నవంబర్‌లో అతి భయంకర రీతిలో జిహాదీలు ముంబయిపై దాడి చేసి సాగించిన దారుణ మారణకాండను పశ్చిమ ఆసియాలోని ఇస్లాం మత రాజ్యాల ప్రజలలో ఎక్కువ మంది సమర్ధించారని సర్వేలలో వెల్లడైంది. అందువల్ల భారతదేశం నుంచి తమ దేశానికి వస్తున్న వివిధ మతాల వారిని సౌదీ అరేబియాలోని సంపన్న యజమానులు, సౌదీ ప్రభుత్వం వారు వివిధ కష్టాలకు, నష్టాలకు గురి చేయడం సహజం. కానీ మన ప్రభుత్వం దశాబ్దుల తరబడి దీన్ని పట్టించుకోకపోవడమే మరింత దిగ్భ్రాంతికరం.
పట్టించుకుని ఉండినట్టయితే మన ప్రభుత్వం ‘సౌదీ అరేబియాకు వెళ్లవద్ద’ని మన ప్రజలకు హెచ్చరికలు చేసి ఉండేది. మనవారు ఆ క్రూర దేశానికి వెళ్లకుండా నిరోధించి ఉండేది. మన దేశస్థులను పశువుల వలే చితకబాది చిత్రహింసల పాలు చేస్తున్న అక్కడి సంపన్నులను శిక్షించవలసిందిగా సౌదీ అరేబియా ప్రభుత్వాన్ని నిలదీసి ఉండేది. ఇప్పుడు సౌదీ అరేబియాలోని వివిధ శవాగారాలలో మగ్గుతున్న మృతదేహాలను మన దేశానికి తరలించుకొనిరావడానికి అవసరమైన వ్యయాన్ని ఈ మృతుల సేవలను వినియోగించుకొన్న సౌదీ యజమానులు భరించాలి. ఉద్యోగపు ఒప్పందంలోని ఈ నిబంధనను యజమానులు ఉల్లంఘించారు. అందువల్లనే మృతదేహాలు అక్కడే పడి ఉన్నాయిట! ఒక్కొక్క మృతదేహం తరలింపునకు ఆరు లక్షల రూపాయల వ్యయం అవుతుందిట! ఈ ఖర్చును భరించవలసిందిగా సౌదీ అరేబియా ప్రభుత్వం మృతుల యజమానులను కోరాలి. లేదా ఖర్చును అక్కడి ప్రభుత్వమే భరించి మృతదేహాలను మన దేశానికి పంపాలి. ఇది జరగనపుడు మన ప్రభుత్వం దౌత్యనీతిని ప్రయోగించి సౌదీ ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. సౌదీ అరేబియా ప్రభుత్వం మనతో గొప్ప మైత్రిని నటిస్తోంది. మన ప్రభుత్వం మురిసిపోతోంది. అలాంటపుడు సౌదీ ప్రభుత్వం ఎందుకని ఇలా మృతులపై కసి తీర్చుకొంటోంది? మన ప్రభుత్వం ఎందుకని అడగదు??
ఈ మృతులలో అత్యధికులు తెలుగు రాష్ట్రాలకు చెందినవారట! సౌదీ అరేబియాకు వెళ్లి ఉద్యోగాలు చేసిన వారిలో చనిపోయిన వారు రోగగ్రస్తులయ్యారు, ప్రమాదాల పాలయ్యారు, హత్యలకు గురయ్యారు, ఆత్మహత్యలు చేసుకొన్నారు. గృహ సహాయకులుగా పనిచేస్తుండిన మహిళలను మేడల మీదనుంచి కిందికి తోసిపారేసి హత్యలు చేసిన రాక్షస గృహిణులు సౌదీలో ఉ న్నారు. ఈ హత్యలను ప్ర మాదాలుగా చిత్రీకరించి చేతులు దులుపుకోగల వా రున్నారు. కొరడాలతో కొ ట్టడం, తిండి నీరు ఇవ్వకుండా నిర్బంధించి మలమల మాడ్చడం, యువతులపై లైంగిక బీభత్సకాండ జరపడం, ఉద్యోగులను కూలీలను కొట్టి గాయపరచి వికలాంగుల్ని చేయడం సౌదీ అరేబియా ‘సంపన్నుల’ జీవన స్వభావమైపోయింది. ఈ దారుణాలలో తొంబయి తొమ్మిది శాతం బయటపడడం లేదు. చిత్రహింసల నుంచి తప్పించుకొని పారిపోయిన ఒక శాతం భారతీయులలో కొందరు మళ్లీ పట్టుబడి చేయని నేరాలకు చెరశాలల పాలవుతున్నారు లేదా సౌదీ చట్టాల ప్రకారం శిక్షలకు గురై వికలాంగులై పోతున్నారు. తప్పించుకొని మన దేశానికి వచ్చిన అతికొద్దిమంది వివరిస్తున్న సౌదీ సమాజ రాక్షస ప్రవృత్తి మాత్రమే మనకు అందుతున్న సమాచారం. ఎనిమిది వందల మంది భారతీయులు సౌదీ అరేబియాలోను కువైట్‌లోను ఉపాధి కోల్పోయి తిండి లేక మరణావస్థకు చేరుకుంటున్నట్టు గత జూలైలో వార్తలు వెలువడ్డాయి. వీరి సమస్యలను పరిష్కరించడం కోసం మన విదేశాంగ సహాయ మంత్రులు విజయకుమార్ సింగ్, ఎంజె అక్బర్ సౌదీ అరేబియాకు, కువైట్‌కు వెళ్లివచ్చారు. కానీ అప్పుడు కూడా ఈ నూట యాబయి మృతదేహాల సంగతి ప్రచారం కాలేదు. మన ప్రభుత్వానికి ఏ సమాచారం అందడం లేదు.
ఇస్లాం మత రాజ్యాంగ వ్యవస్థలున్న అన్ని దేశాలలో దౌత్యనీతి దౌర్జన్యంతో కూడుకొని ఉంది. ఈ దౌత్య దౌర్జన్యం మన దేశం పట్ల మరింత తీవ్రంగా కొనసాగుతోంది. దిల్లీ సమీపంలోని గుర్‌గావ్‌లోని తన నివాస గృహంలోనే ఒక సౌదీ అరేబియా దౌత్యవేత్త జరిపిన లైంగిక బీభత్సకాండ గత ఏడాది ప్రకంపనాలు సృష్టించింది. దిల్లీలోని సౌదీ రాయబారి కార్యాలయంలో పనిచేసిన ఆ బీభత్స దౌత్యవేత్త తన నివాసంలోనే ఆరునెలల పాటు ఇద్దరు మహిళలను బంధించాడు. నేపాల్‌కు చెందిన ఆ మహిళలకు తమ దేశంలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి వారిని తన ఇంటికి తీసుకువెళ్లిన ఆ దౌత్య ఉగ్రవాది వారిని పరిచారికలుగా ఉపయోగించుకున్నాడు. కానీ ఆరు నెలల పాటు వారిద్దరినీ వాడు, వాని మిత్రులు సామూహిక లైంగిక బీభత్సకాండకు గురిచేశారు. నేరం బయటపడిన తరువాత కూడా ఆ దౌత్యవేత్తను మన ప్రభుత్వం అరెస్టు చేయించలేక పోయింది- సౌదీ ప్రభుత్వానికి భయపడి! ఆ దుండగుడు దర్జాగా సౌదీకి వెళ్లిపోయాడు!!