సంపాదకీయం

డొనాల్డ్ ప్రస్థానం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘నాటో’కు కాలదోషం పట్టింది. బ్రిటన్ ‘ఐరోపా ఏకీకృత విపణి’ వ్యవస్థ- సింగిల్ మార్కెట్- నుంచి వైదొలగడం మిక్కిలి మేలైన పరిణామం.. ఇలాంటి ప్రకటనలతో సంచలనం సృష్టిస్తున్న రిపబ్లికన్ పార్టీ నాయకుడు డొనాల్డ్ ట్రంప్ జనవరి ఇరవయ్యవ తేదీన అమెరికా నలబయి ఐదవ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నాడు. అహంకారం, అజ్ఞానం, ఆర్థిక అతిశయం, దౌత్య దౌర్జన్యం, సంకుచిత తత్వం కలగా పులగంగా రూపమెత్తిన డొనాల్డ్ ట్రంప్ అమెరికాను ఏ దిశగా నడిపించనున్నాడన్నది ఆ దేశ ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్న వ్యవహారం. అమెరికా అంతటా ట్రంప్ వ్యతిరేక ప్రదర్శనలు తీవ్రతరం కావడం నూతన అధ్యక్షుని పరిపాలన ప్రారంభానికి విచిత్రమైన నేపథ్యం. ప్రపంచంలో ఏ దేశాధినేత పదవీ స్వీకరణకు లేని ప్రాధాన్యం, ఏ ప్రభుత్వం అధినేత అధికార ప్రస్థాన ప్రారంభానికి లేని ప్రాముఖ్యం అమెరికా అధ్యక్షుని పదవీ గ్రహణ ఉత్సవానికి ఏర్పడి ఉండడం దశాబ్దుల వైపరీత్యం. అమెరికాలో ‘అధ్యక్ష’ ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పడి ఉంది. అందువల్ల అమెరికా అధ్యక్షుడు పార్లమెంటరీ ప్రజాస్వామ్య దేశాలలో వలె రాజ్యాంగ లాంఛన ప్రాయమైన దేశాదినేత మాత్రమే కాదు, క్రియాశీల ప్రభుత్వ అధినేత కూడా. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలోని ప్రధానమంత్రి, దేశాధ్యక్ష పదవుల ఉమ్మడి రూపం అమెరికా అధ్యక్ష పదవి. అందువల్ల ‘అమెరికా అధ్యక్షుడు’ అంతర్జాతీయంగా గొప్ప ప్రాధాన్యం సంతరించుకున్నాడు. 1918లో ముగిసిన మొదటి ప్రపంచ యుద్ధం నాటికి బ్రిటన్ ప్రపంచంలో అగ్రరాజ్యం. 1945లో రెండో ప్రపంచ యుద్ధం ముగిసే నాటికి బ్రిటన్ ఆధిపత్యం అంతరించింది. బ్రిటన్ సామ్రాజ్యవాద, దురాక్రమణ వారసత్వం అమెరికాకు, అప్పటి సోవియట్ యూనియన్- ఇప్పటి రష్యా-కు సంక్రమించింది. 1950వ దశకం ఆరంభం నుంచి అమెరికా, రష్యాల మధ్య కొనసాగిన అంతర్జాతీయ ఆధిపత్య సంఘర్షణ ‘ప్రచ్ఛన్న యుద్ధం’- కోల్డ్‌వార్-గా పరిణమించడం చరిత్ర. 1990వ దశకంలో సోవియట్ రష్యా సామ్రాజ్యం విచ్ఛిన్నమైపోయి పదిహేను స్వతంత్ర దేశాలు- 1917 నాటికి పూర్వం వలె- మళ్లీ ఏర్పడినాయి. రష్యా మళ్లీ అగ్రరాజ్యం కాలేకపోతోంది. పదిహేనేళ్ల పాటు ఏకైక అగ్రరాజ్యంగా కొనసాగిన అమెరికా చివరికి 2008లో ఆర్థికంగా దివాలా తీసింది. చైనా అమెరికాతో పోటీ పడుతోంది. రష్యా చైనాతో జట్టు కట్టింది. పాకిస్తాన్ ‘రష్యా-చైనా’ కూటమికి దగ్గరైపోవడం, మనదేశం అమెరికాకు దగ్గరగా జరుగుతుండడం డొనాల్డ్ ట్రంప్ అధికార అవతరణకు అతి సన్నిహిత నేపథ్యం. అమెరికాలో విదేశీయుల ఉనికిని, మనికిని సహించని ట్రంప్ ప్రభుత్వం ప్రవాస భారతీయుల పట్ల ఎలా ప్రవర్తిస్తుందన్నది వేచి చూడదగిన అంశం.
అమెరికాలోని ఉపాధి వనరులను, ఉద్యోగాలను విదేశీయులు కొల్లగొడుతున్నారన్నది ట్రంప్ ప్రధాన ఆందోళన! ‘ఐరోపా ఏకీకృత విపణి వ్యవస్థ’ నుంచి వైదొలగాలన్న బ్రిటన్ ప్రభుత్వ విధానాన్ని ట్రంప్ గట్టిగా సమర్ధిస్తున్నాడు. సంకుచిత- ప్రొటక్షనిస్ట్- ఆర్థిక విధానం ఈ ఉభయ దేశాలు పాటిస్తుండడం బ్రిటన్ ప్రభుత్వ నిర్ణయాన్ని అమెరికా అధ్యక్ష పదవీ బాధ్యతలను స్వీకరించనున్న ట్రంప్ గొప్పగా సమర్ధించడానికి ప్రధాన కారణం. ఈ సంకుచిత విధానాన్ని అమెరికా, బ్రిటన్ ప్రభుత్వాలు ఏళ్ల తరబడి పాటిస్తున్నాయి. ఐరోపా సమాఖ్య- యూరోపియన్ యూనియన్- ఇయు- నుంచి వైదొలగాలని గత జూన్‌లో బ్రిటన్ వోటర్లు నిర్ధారించడానికి ఈ సంకుచిత జాతీయ అతిశయం కారణం. అది రాజకీయ నిర్ణయం. ప్రజల నిర్ణయంతో విభేదించిన కన్సర్వేటివ్ పార్టీ నాయకుడు డేవిడ్ కామెరాన్ బ్రిటన్ ప్రధాని పదవి నుంచి, రాజకీయాల నుంచి వైదొలగిపోయాడు. ఆ తర్వాత బ్రిటన్ ప్రధానిగా ధెరీసా మాయ్ బాధ్యతలను స్వీకరించింది. మాయ్ ఇపుడు మరింత ముందుకెళ్లి ‘ఐరోపా ఏకీకృత విపణి వ్యవస్థ’ నుంచి బ్రిటన్ వైదొలగనున్నట్టు ప్రకటించింది. ఐరోపా సమాఖ్య వెలుపలి దేశాల పౌరులు తమ దేశంలోకి ‘వలస’ రావడంపై బ్రిటన్ ఇదివరకే ఆంక్షలను విధించింది. ఇప్పుడు ‘సింగిల్ మార్కెట్’ నుంచి వైదొలగడం వల్ల ఇతర దేశాల వారు సైతం తమ దేశంలోకి వలస రాకుండా నియంత్రించడానికి బ్రిటన్‌కు వీలుకలుగుతుంది. ట్రంప్ దీన్ని సమర్థిస్తున్నాడు!
ముప్పయి ఏళ్ల క్రితం మార్గరెట్ థాచర్ ప్రధానిగా ఉన్న సమయంలో బ్రిటన్ ‘సింగిల్ మార్కెట్’లో ప్రవేశించింది. సింగిల్ మార్కెట్ విజయానికి కృషి చేయనున్నట్టు ‘్థచరమ్మ’ అప్పుడు ప్రతిజ్ఞ చేసింది. ఇప్పుడు ‘మాయమ్మ’ ఈ ‘మార్కెట్’ నుంచి బయటపడాలని నిర్ణయించడం ద్వారా ‘సంకుచిత’- ప్రొటక్షనిస్ట్- వాణిజ్యనీతిని మరింత సంకుచితం చేసింది. ఈ ‘ప్రొ టక్షనిస్ట్’ విధానం ‘ప్ర పంచీకరణ’ స్ఫూర్తికి వ్యతిరేకం. ప్రపంచ వాణిజ్య సంస్థ- వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్- డ బ్ల్యుటిఓ- ఆర్థిక స్ఫూ ర్తికి విరుద్ధం. స్వేచ్ఛావాణిజ్య వ్యవస్థ- మార్కెట్ ఎకానమీ- మాధ్యమం గా మొత్తం ప్రపంచాన్ని ‘సింగిల్ మార్కెట్’- ఏకీకృత విపణి- గా మార్చడం ప్రపంచీకరణ లక్ష్యం. అందువల్ల సంపన్న దేశాల వాణిజ్య సంస్థలు ప్రవర్ధమాన దేశాల ప్రజలను చక్కగా దోచుకోవచ్చు! అమెరికా, బ్రిటన్, ఐరోపా, చైనా, దక్షిణ కొరియా వంటి దేశాల ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు’ మన దేశం వంటి ప్రవర్ధమాన దేశాలను లూటీ చేస్తున్నాయి కూడా. ఇలా ప్రపంచీకరణను నడిపిస్తున్న అమెరికాకు అధ్యక్షుడవుతున్న ట్రంప్ తమ దేశంలోకి మాత్రం ఇతర దేశాలవారు రావద్దంటున్నాడు. అందువల్లనే అతగాడు బ్రిటన్ వారి ‘బ్రెక్సిట్’- బ్రిటన్స్ ఎక్జిట్’- ఐరోపా నుంచి బ్రిటన్ నిష్క్రమణ-ను బలపరుస్తున్నాడు. మానవీయ దృష్టితో సిరియాకు చెందిన, ఆఫ్రికాకు చెందిన శరణార్థులకు ఆశ్రయం ఇస్తున్న జర్మన్ ప్రధానమంత్రి- ఛాన్సలర్- ఏంజెలా మార్కల్‌ను విమర్శిస్తున్నాడు. రష్యా పట్ల ట్రంప్ మక్కువను ప్రదర్శించడం హర్షణీయం. కానీ ‘నాటో’ కాలదోషం పట్టిందనడం అజ్ఞానానికి చిహ్నం. ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో సోవియట్ యూనియన్‌ను నిరోధించడానికై ‘నాటో’- ఉత్తర అట్లాంటిక్ రక్షణ కూటమి- ను అమెరికా, ఐరోపాలు ఏర్పాటు చేశాయి. ఇప్పుడు రష్యా ప్రమాదం లేదు. ప్రచ్ఛన్నయుద్ధం కూడా లేదు. కానీ, జిహాదీ బీభత్సకాండ మానవ సమాజానికి ప్రధాన శత్రువుగా మారింది. ఈ బీభత్సకాండను నిర్మూలించడం కోసమే ‘నాటో’ ఇరాక్‌తోను, ఆఫ్ఘానిస్తాన్ తోను రెండు యుద్ధాలు చేసింది. ఇప్పుడు సిరియాలో ‘నాటో’ సైనికులు జిహాదీలతో తలపడవలసి వస్తోంది. అందువల్ల ‘నాటో’కు కాలం చెల్లిపోతోందని ట్రంప్ వ్యాఖ్యానించడం అమెరికా ప్రజలకు నచ్చని అంశం..
అమెరికా అంతటా ట్రంప్‌కు వ్యతిరేకంగా నిరసనలు చెలరేగడానికి ఇవి మాత్రమే కారణాలు కాదు. కుటుంబ సభ్యులకు, వాణిజ్యవేత్తలకు ప్రభుత్వ నిర్వహణలో ట్రంప్ మితిమీరిన ప్రాధాన్యం కల్పించనుండడం కూడా ప్రజలకు నచ్చని వ్యవహారం. ట్రంప్ అధ్యక్షుడిగా పనిచేయడానికి కేవలం నలబయి శాతం అమెరికా ప్రజలు సమర్ధిస్తున్నారట! ప్రారంభంలోనే అధ్యక్షుడి పట్ల వోటర్లలో ఇంతటి వ్యతిరేకత ఉండడం నలబయి ఏళ్లలో ఇదే మొదటిసారి..